SCR Special Trains : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, లిస్ట్ ఇదే
South Central Railway Special Trains : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. రద్దీని తగ్గించేందుకు 20 ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. ఇందులో చాలా రైళ్లు, ఏపీ, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించేవి ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ట్రైన్స్ నడవనున్నాయి.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. పలు రూట్లలో నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. జనవరి 1 నుంచి మార్చి నెల వరకు రాకపోకలు ఉంటాయని పేర్కొంది.
మొత్తం 20 రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందులో చాలా రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించేవి ఉన్నాయి. వచ్చే జనవరిలోనే సంక్రాంతి పండగ ఉంది. దేశవ్యాప్తంగానూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి సెలవులు ఉండటంతో… చాలా మంది సొంత ఊర్లకు ప్రయాణమవుతుంటారు. వీటన్నింటి దృష్ట్యా… ఈ రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటనలో వెల్లడించింది.
- సికింద్రాబాద్ - రామంతపురం
- రామంతపురం - సికింద్రాబాద్
- కాచిగూడ - మధురై
- మధురై - కాచిగూడ
- నాదేండ్ - ఎరోడ్
- కాచిగూడ - నాగర్ సోల్
- నాగర్ సోల్ - కాచిగూడ
- తిరుపతి - అకోలా
- అకోలా - తిరుపతి
- తిరుపతి - సికింద్రాబాద్
- సికింద్రాబాద్ - తిరుపతి
- కాకినాడ టౌన్ - లింగపల్లి
- లింగపల్లి - కాకినాడ టౌన్
- హైదరాబాద్ - కటక్
- కటక్ - హైదరాబాద్
- హైదరాబాద్ - రక్సేల్
- రక్సేల్ - సికింద్రాబాద్
- నర్సాపూర్ - సికింద్రాబాద్
- బెంగళూర్ - నర్సాపూర్.
మరోవైపు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్ తగ్గడంతో.. శబరిమలకు వెళ్లే 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. శబరిమల యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో.. 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. సాధారణంగా జనవరి 15 వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంది.
రైలు నం. 07167 మౌలాలీ - కొట్టాయం (జనవరి 24), రైలు నం. 07168 కొట్టాయం - మౌలాలీ (జనవరి 25), రైలు నం.07171 మౌలాలీ - కొల్లాం (జనవరి 25) రద్దయ్యాయి. రైలు నం. 071 కొల్లాం - మౌలాలీ (జనవరి 27), రైలు నం.07169 కాచిగూడ - కొట్టాయం (జనవరి 26), రైలు నం. 07170 కొట్టాయం - కాచిగూడ (జనవరి 27), రైలు నం. 07157 నర్సాపూర్ - కొల్లాం (జనవరి 27) రైలు నం. 07158 కొల్లాం (జనవరి 29), రైలు నం. 07065 హైదరాబాద్ – కొట్టాయం (జనవరి 28) రైళ్లు రద్దయ్యాయి.
రైలు నెం. 07066 కొట్టాయం - సికింద్రాబాద్ (జనవరి 29), రైలు నం. 07167 మౌలాలీ - కొట్టాయం (జనవరి 31), రైలు నం.07168 కొట్టాయం - మౌలాలీ (ఫిబ్రవరి 01), రైలు నం. 071 కాగజ్‌నగర్ - కొల్లాం (జనవరి 24), రైలు నెం. 07162 కొల్లాం - సిర్పూర్ కాగజ్‌నగర్ (జనవరి 26) రైళ్లు రద్దయ్యాయి. అయితే.. ఈ రైళ్లలో ప్రయాణం కోసం రిజర్వేషన్ చేసుకున్న వారికి ఇతర ట్రైన్లలో అవకాశం కల్పిస్తారా.. డబ్బులు రీఫండ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అధికారులు నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
సంబంధిత కథనం