Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలకు వెళ్లే 14 ప్రత్యేక రైళ్లు రద్దు.. వీరిపై ఎఫెక్ట్!
Sabarimala Special Trains : సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు వెళ్లే 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. ఈ ప్రభావం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య శబరిమల వెళ్లేవారిపై పడనుంది. రైళ్లను రద్దు చేయడానికి అధికారులు వివిధ కారణాలు చెబుతున్నారు.
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్ తగ్గడంతో.. శబరిమలకు వెళ్లే 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. శబరిమల యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో.. 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. సాధారణంగా జనవరి 15 వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంది.
ఆశించిన స్థాయిలో..
ఈసారి కూడా ఎక్కువ రద్దీ ఉంటుందని ఊహించిన దక్షిణ మధ్య రైల్వే.. డిసెంబర్, జనవరి నెలల్లో 120 కి పైగా రైళ్లను షెడ్యూల్ చేసింది. కానీ.. ఆశించిన స్థాయిలో డిమాండ్ లేదు. దీంతో శబరిమలకు వెళ్లే రైళ్లను రద్దు చేసింది. ముఖ్యంగా జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య షెడ్యుల్ చేసిన రైళ్లను రద్దు చేసింది. దీంతో ఈ సమయంలో శబరిమల వెళ్లేవారికి కష్టాలు తప్పేలా లేవు.
రద్దు చేసిన రైళ్లు..
రైలు నం. 07167 మౌలాలీ - కొట్టాయం (జనవరి 24), రైలు నం. 07168 కొట్టాయం - మౌలాలీ (జనవరి 25), రైలు నం.07171 మౌలాలీ - కొల్లాం (జనవరి 25) రద్దయ్యాయి. రైలు నం. 071 కొల్లాం - మౌలాలీ (జనవరి 27), రైలు నం.07169 కాచిగూడ - కొట్టాయం (జనవరి 26), రైలు నం. 07170 కొట్టాయం - కాచిగూడ (జనవరి 27), రైలు నం. 07157 నర్సాపూర్ - కొల్లాం (జనవరి 27) రైలు నం. 07158 కొల్లాం (జనవరి 29), రైలు నం. 07065 హైదరాబాద్ – కొట్టాయం (జనవరి 28) రైళ్లు రద్దయ్యాయి.
రైలు నెం. 07066 కొట్టాయం - సికింద్రాబాద్ (జనవరి 29), రైలు నం. 07167 మౌలాలీ - కొట్టాయం (జనవరి 31), రైలు నం.07168 కొట్టాయం - మౌలాలీ (ఫిబ్రవరి 01), రైలు నం. 071 కాగజ్‌నగర్ - కొల్లాం (జనవరి 24), రైలు నెం. 07162 కొల్లాం - సిర్పూర్ కాగజ్‌నగర్ (జనవరి 26) రైళ్లు రద్దయ్యాయి. అయితే.. ఈ రైళ్లలో ప్రయాణం కోసం రిజర్వేషన్ చేసుకున్న వారికి ఇతర ట్రైన్లలో అవకాశం కల్పిస్తారా.. డబ్బులు రీఫండ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.