Kumbh Mela Trains : కుంభ మేళాకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లు ప్రకటన
Kumbh Mela Special Trains : ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కుంభ మేళాకు మరో ఎనిమిది ప్రత్యేక రైళ్ల సేవలు ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. మరో నాలుగు రైళ్ల సేవలు పొడిగించింది.
mbh Mela Special Trains : కుంభ మేళా రద్దీని క్లియర్ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే...పలు స్టేషన్ల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.
- రైలు నెం. 06019 : మంగళూరు సెంట్రల్ - వారణాసి(18.01.2025 & 15.02.2025)
- రైలు నెం. 06020 : వారణాసి మంగళూరు సెంట్రల్(21.01.2025 & 18.02.2025)
- రైలు నెం.06071 : చెన్నై సెంట్రల్ - గోమతి నగర్(18.01.2025 & 15.02.2025)
- రైలు నెం.06072 : గోమతి నగర్-చెన్నై సెంట్రల్(21.01.2025 & 18.02.2025)
రైలు నం. 06019/06020 : మంగళూరు సెంట్రల్ - వారణాసి - మంగళూరు సెంట్రల్
ఈ ప్రత్యేక రైళ్లు కాసర్‌గోడ్, నీలేశ్వర్, పయ్యనూర్, కన్నూర్, తలస్సేరి వడకరా, కోజికోడ్, ఫెరోక్, తిరూర్, షోరనూర్, ఒట్టపాలెం, పాలక్కాడ్, కోయంబత్తూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, అరక్కోణం, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రపూర్, నాగ్‌పూర్, ఇటార్సీ పిపారియా, జబల్‌పూర్, కట్నీ, మైహర్, సత్నా స్టేషన్‌లు ఇరువైపులా ఆగుతాయి.
రైలు నెం. 06071/06072 చెన్నై సెంట్రల్ - గోమతి నగర్ - చెన్నై సెంట్రల్
ఈ ప్రత్యేక రైళ్లు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, కొత్త గుంటూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, గోండియా, బాలాఘాట్, నైన్‌పూర్, జబల్‌పూర్, కట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛెజాక్, చునార్, వారణాసి, అయోధ్య ధామ్ స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి.
ప్రత్యేక రైలు సేవల పొడిగింపు
ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగింది.
- రైలు నం. 01435 - షోలాపూర్ టు LTT ముంబయి(07.01.2025 నుంచి 25.03.2025 వరకు) ప్రతి మంగళవారం
- రైలు నం. 01436 -LTT ముంబయి టు షోలాపూర్(01.01.2025 నుంచి 26.03.2025 వరకు) ప్రతి బుధవారం
- రైలు నం. 01437 - షోలాపూర్ టు తిరుపతి (02.01.2025 నుంచి 27.03.2025 వరకు) ప్రతి గురువారం
- రైలు నం. 01438 - తిరుపతి టు షోలాపూర్(03.01.2025 నుంచి 28.03.2025 వరకు) ప్రతి శుక్రవారం
సంబంధిత కథనం