SCR Special Trains for Sankranti Festival: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. 14 ప్రత్యేక ట్రైన్లను ప్రకటిస్తూ వివరాలను పేర్కొంది. తెలంగాణ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల మీదుగా వెళ్లనున్నాయి. ఈ మేరకు ఆయా వివరాలను చూస్తే….,సంక్రాంతిని పురస్కరించుకుని మొత్తం 14 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. జనవరి 1 నుంచి 19 వరకు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపనున్నారు.,మచిలీపట్నం- కర్నూలు సీటి,కర్నూలు - మచిలీపట్నం,మచిలీపట్నం - తిరుపతి,తిరుపతి - మచిలీపట్నం,విజయవాడ - నాగర్ సోల్,నాగర్ సోల్ - విజయవాడ,కాకినాడ టౌన్ - లింగంపల్లి,లింగంపల్లి - కాకినాడ టౌన్,పూర్ణ - తిరుపతి,తిరుపతి- పూర్ణ,తిరుపతి - అకోలా,అకోలా - తిరుపతి,మచిలీపట్నం - సికింద్రాబాద్,సికింద్రాబాద్ - మచిలీపట్నం,,అజ్మీర్ యాత్రకు స్పెషల్ ట్రైన్స్….Special Trains for Ajmeer Ursu: అజ్మీర్ ఉర్సుకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. 811వ వార్షిక ఉర్సు మహోత్సవాలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.,ట్రైన్ నంబర్ 07125/07126 హైదరాబాద్-మదర్ జంక్షన్-హైదరాబాద్ స్పైషల్ ట్రైన్ హైదరాబాద్‌లో 2023 జనవరి 23న బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 31న మదర్ జంక్షన్‌లో బయల్దేరుతుంది. ఈ రైలు సికింద్రబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముడ్‌ఖేడ్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలీ, వాసిం, అకోలా, మల్కాపూర్, ఖాండ్వా, ఇటార్సి, భోపాల్, సంత్ హిర్దారామ్ నగర్, మస్కి, ఉజ్జయిని, నగ్డా, రాట్లం, నిమచ్, చిత్రదుర్గ్, చండేరియా, భిల్వారా, నజిరాబాద్, అజ్మీర్ స్టేషన్లలో ఆగుతుంది.,ట్రైన్ నంబర్ 07129/07130 కాచిగూడ-మదర్ ప్రత్యేక రైలు వచ్చే ఏడాది జనవరి 23న కాచి గూడ నుంచి బయల్దేరుతుంది. మల్కాజ్‌గిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముడ్‌ఖేడ్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలీ, వాసిం, అకోలా, మల్కాపూర్, ఖాండ్వా, ఇటార్సి, భోపాల్, సంత్ హిర్దారామ్ నగర్, మస్కి, ఉజ్జయిని, నగ్డా, రాట్లం, నిమచ్, చిత్రదుర్గ్, చండేరియా, భిల్వారా, నజిరాబాద్, అజ్మీర్ స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇవే స్టేషన్లలో రైలు ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో మదర్ నుంచి జనవరి 31 నుంచి బయల్దేరుతుంది.,ట్రైన్ నంర్ 07131/07132 మచిలీపట్నం-మదర్ జంక్షన్ - మచిలీపట్నం ప్రత్యేకరైలు జనవరి 24న బందరులో బయలు దేరుతుంది. పెడన, గుడివాడ, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబబాద్, వరంగల్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్ బలార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, మస్కీ, ఉజ్జయిని, నగ్డా, రాట్లం, నిమచ్, చిత్రదుర్గ్, చండేరియా, భిల్వారా, నజిరాబాద్, అజ్మీర్ స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇవే స్టేషన్లలో రైలు ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో మదర్ నుంచి ఫిబ్రవరి 1న బయల్దేరుతుంది.,ట్రైన్ నంబర్ 07227 తిరుపతి-అజ్మీర్-తిరుపతి ప్రత్యేక రైలు జనవరి 25న తిరుపతిలో బయల్దేరుతుంది. ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ, మధిర, ఖమ్మం, మహబాబాబాద్, వరంగల్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బలార్షా, నాగపూర్, ఇటార్సీ, భోపాల్, సంత్ హిర్దా రామ్ నగర్, మస్కీ, ఉజ్జయిని, నాగ్డా, రాట్లం, నిమచ్, చిత్రదుర్గ్, భిల్వారా, బిజయ్ నగర్, నసిరాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.,ట్రైన్ నంబర్ 07641/07642 నాందేడ్-అజ్మీర్-నాందేడ్ ప్రత్యేక రైలు జనవరి 27న నాందేడ్‌లో బయలు దేరుతుంది. ఈ రైలు పూర్ణ, పర్భానీ, సేలు, పార్తూర్, జాల్నా, ఔరంగాబాద్, రోటేగావ్, అనకీ, మన్మాడ్, భుస్వాల్, ఖాండ్వా, ఇటార్సీ, భోపాల్, సంత్ హిర్దారామ్ నగర్, మస్కి, ఉజ్జయిని, నగ్డా, రాట్లం, నిమచ్, చిత్రదుర్గ్, భిల్వారా, బిజయ్ నగర్, నసిరాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో అజ్మీర్‌లో ఫిబ్రవరి 1న బయల్దేరుతుంది., ,