SCR Special Trains : విశాఖ - మహబూబ్​నగర్​, కాచిగూడ - కొల్లంకు స్పెషల్ టైన్స్-south central railway announced special trains between various destinations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  South Central Railway Announced Special Trains Between Various Destinations

SCR Special Trains : విశాఖ - మహబూబ్​నగర్​, కాచిగూడ - కొల్లంకు స్పెషల్ టైన్స్

HT Telugu Desk HT Telugu
Nov 23, 2022 06:47 AM IST

south central railway special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

దక్షిణ మధ్య రైల్వే, ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే, ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం - మహబూబ్ నగర్, కాచిగూడ - కొల్లం, కొల్లం- కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను చూస్తే......

ట్రెండింగ్ వార్తలు

visakhapatnam to mahabubnagar special trains: విశాఖపట్నం - మహబూబ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. వచ్చే నెల 6వ తేదీ నుంచి 27వ తేదీల్లో వీటిని నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో విశాఖ నుంచి సాయంత్రం 05.35 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10.30 నిమిషాలకు మబబూబ్ నగర్ కు చేరుకుంటుంది.

ఇక మహబూబ్ నగర్ - విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ట్రైన్స్ డిసెంబర్ 7 నుంచి 28వ తేదీల మధ్య అందుబాటులో ఉంటాయి. ఈ రైలు... మహబూబ్ నగర్ నుంచి సాయంత్రం 06.20 నిమిషాలకు బయల్దేరి.. మరునాడు ఉదయం 09.50 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు.... దువ్వాడ, అన్నవరం, సామల్ కోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగడూ, నల్గొండ, మల్కాజ్ గిరి, కాజిగూడ, షాద్ నగర్, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలో ఏసీ 3 టైర్,స్లీపర్ అండ్ జనరల్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారుల తెలిపారు.

kachiguda kollam special trains: కాచిగూడ - కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు, ఈ ప్రత్యేక రైళ్లు... డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఆయా తేదీల్లో ట్రైన్ కాచిగూడ నుంచి మధ్యాహ్నం 03.50 నిమిషాలకు బయల్దేరి.. మరునాడు రాత్రి 11.50 నిమిషాలకు కొల్లాంకు చేరుతుంది. ఇక కొల్లంనుంచి కాచిగూడకు స్పెషల్ ట్రైన్స్ ప్రకటించారు అధికారులు. డిసెంబర్ 7,14,21,28, వచ్చే ఏడాది జనవరి 4, 11 తేదీల్లో రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్స్ కొల్లాం నుంచి అర్ధరాత్రి 2.30 నిమిషాలకు రైలు బయల్దేరి... మరునాడు ఉదయం 10 గంటలకు కాచిగూడకు చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు.... షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ఎర్రగుంట, కమలాపురం, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, కట్పాడీ, సేలం, త్రిపూర్, కోయంబత్తూర్, పాలఘాట్, త్రిశూర్, అలువా, ఎర్నాకులం, కొట్టాయ, తిరువల్లా, కయన్ కులం స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటించారు.

ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.

IPL_Entry_Point