Special Trains: సికింద్రాబాద్, తిరుపతి, పూరీకి ప్రత్యేక రైళ్లు - రూట్స్ ఇవే-south central railway announced special trains between various destinations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  South Central Railway Announced Special Trains Between Various Destinations

Special Trains: సికింద్రాబాద్, తిరుపతి, పూరీకి ప్రత్యేక రైళ్లు - రూట్స్ ఇవే

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 08:19 AM IST

south central railway special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తీపి కబురు చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి, సికింద్రాబాద్, పూరీ, సుబేదార్ గంజ్ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను చూస్తే......

ట్రెండింగ్ వార్తలు

tirupati secunderabad special trains: తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నెల 10వ తేదీన తిరుపతి నుంచి రాత్రి 09.10 గంటలకు రైలు బయల్దేరి... మరునాడు ఉదయం 09.30 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ ట్రైన్ రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, మంత్రాలయం, రాయిచూర్, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో ఆగుతుంది.

secunderabad - puri special trains: సికింద్రాబాద్ - పూరీ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ నెల 11, 18, 25వ తేదీల్లో ఈ సేవలను నడపనున్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్ రాత్రి 08.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరి మరునాడు సాయంత్రం 05.30 నిమిషాలకు పూరీకి చేరుతుంది. ఇక పూరీ నుంచి కూడా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ నెల 12, 19, 26 తేదీల్లో రాత్రి 10.45 నిమిషాలకు బయల్దేరి.. మరునాడు రాత్రి 08.30 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు... కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిరా, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామల్ కోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బెరంపుర్, ఖుర్దా రోడ్ స్టేషన్లలో ఆగుతుంది.

subedarganj special trains: సుబేదార్ గంజ్ - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ నెల 8 నుంచి 27 తేదీ వరకు ఈ రైళ్లు నడవనున్నాయి. నవంబర్ 8 - 26వ తేదీ వరకు మధ్యాహ్నం 03. 50 నిమిషాలకు సుబేదార్ గంజ్ నుంచి బయల్దేరి... ఆయా తేదీల్లో మరునాడు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్ - సుబేదార్ గంజ్ మధ్య నవంబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 27 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాత్రి 09.50 నిమిషాలకు బయల్దేరి... ఆయా తేదీల్లో మరునాడు ఉదయం 4 గంటలకు సుబేదార్ గంజ్ కు చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు ఫతేపూర్, కాన్పూర్, ఒరై, బీనా, భోపాల్, నాగ్ పూర్, సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట్ జంక్షన్లలో ఆగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రయాణికులను కోరారు.

WhatsApp channel