Diwali Special Trains: కాజీపేట్, ఖమ్మం, గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు-south central railway announced special trains between various destinations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  South Central Railway Announced Special Trains Between Various Destinations

Diwali Special Trains: కాజీపేట్, ఖమ్మం, గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Oct 16, 2022 05:52 AM IST

south central railway special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

సికింద్రాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు,
సికింద్రాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు,

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... దీపావళి నేపథ్యంలో మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ - తిరుపతి, సికింద్రాబాద్ - సంత్రగాచి, నర్సాపూర్ - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు వివరాలను చూస్తే....

ట్రెండింగ్ వార్తలు

secunderabad - tirupati sepcail trains: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు అక్టోబర్ 19వ తేదీన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 08.25 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 07.50 నిమిషాలకు తిరుపతి చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఇక తిరుపతి నుంచి అక్టోబర్ 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు బయల్జేరి... మరునాడు ఉదయం 05.45 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగరి, గుడూరు, నెల్లూరు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగాం స్టేషన్లలో ఆగుతుంది.

secunderabad - santragachi special trains: సికింద్రాబాద్ - సంత్రగాచి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ రైళ్లు అక్టోబర్ 21వ తేదీన ఉదయం 08.40 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10.25 నిమిషాలకు సంత్రగాచి చేరుతుంది. ఇక సంత్రగాచి నుంచి అక్టోబర్ 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు బయల్దేరి... మరునాడు రాత్రి 09.00 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు....నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్ కోట్, దువ్వాడ, విశాఖ, విజయనగరం, ఖుద్రారోడ్, కటక్, భద్రక్, బాలాసోర్, కరగ్ పూర్ స్టేషన్లలో ఆగుతుంది.

secunderabad - narsapur trains: నర్సాపూర్ - సికింద్రాబాద్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నారు. ఈ రైలు అక్టోబర్ 18వ తేదీన నర్సాపూర్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 04.10 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుతుంది.

ఈ రైలు పాలకొల్లు, భీమవరం, అకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

మరోవైపు హైదరాబాద్ నగరంలో ఇవాళ (అక్టోబర్ 16)నడిచే పలు ఎంఎంటీఎస్ రైళ్లను పలు రూట్లలో రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈమేరకు వివరాలను ప్రకటించింది.

NOTE:

లింక్ పై క్లిక్ చేసి దక్షిణ మధ్య రైల్వే తాజా అప్డేట్స్ తెలుసుకోవచ్చు.

IPL_Entry_Point