Sankranti Special Trains : సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్, 52 స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Sankranti Special Trains 2025 : సంక్రాంతి రద్దీ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మధ్య 52 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 6 నుంచి 18 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. రేపు లేదా ఎల్లుండి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
Sankranti Special Trains 2025 : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఉపాధి కోసం పట్టణం బాట పట్టిన వారంతా సంక్రాంతికి సొంతూళ్లకు తిరిగి వెళ్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణలోని తమ సొంత గ్రామాలకు పెద్ద సంఖ్యలో జనం ప్రయాణాలు చేస్తుంటారు. సంక్రాంతి సమయంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మధ్య 52 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్స్ బుకింగ్స్ రేపు లేదా ఎల్లుండి నుంచి అందుబాటులోకి రానుంది.
చర్లపల్లి-తిరుపతి, వికారాబాద్-కాకినాడ, కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-శ్రీకాకుళం, చర్లపల్లి-శ్రీకాకుళం, నాందేడ్-కాకినాడ, చర్లపల్లి-కాకినాడ, చర్లపల్లి-నర్సాపూర్ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
52 ప్రత్యేక రైళ్లు
1. రైలు నెం. 07077 : చర్లపల్లి - తిరుపతి - జనవరి 6వ తేదీ (ఒక సర్వీస్)
2. రైలు నెం. 07078 : తిరుపతి - చర్లపల్లి - 7వ తేదీ(ఒక సర్వీస్)
3. రైలు నెం. 02764 : చర్లపల్లి - తిరుపతి - 8, 11, 15వ తేదీల్లో( 3 సర్వీసులు)
4. రైలు నెం.02763 : తిరుపతి - చర్లపల్లి - 9, 12, 16వ తేదీల్లో ( 3 సర్వీసులు)
5. రైలు నెం. 07037 : వికారాబాద్ - కాకినాడ టౌన్ - 13వ తేదీ ( ఒక సర్వీస్)
6. రైలు నెం.07038 : కాకినాడ టౌన్ - చర్లపల్లి - 14వ తేదీ (01 సర్సీస్)
7. రైలు నెం. 07655 : కాచిగూడ - తిరుపతి - 9, 16వ తేదీల్లో (02 సర్వీసులు)
8. రైలు నెం.07656 : తిరుపతి - కాచిగూడ - 10, 17వ తేదీల్లో( 02 సర్వీసులు)
9. రైలు నెం.07035 : చర్లపల్లి - నర్సాపూర్ - 11, 18వ తేదీల్లో(02 సర్వీసులు)
10. రైలు నెం.07036 : నర్సాపూర్ - చర్లపల్లి - 12, 19వ తేదీల్లో (02 సర్వీసులు)
11. రైలు నెం. 07078 : సికింద్రాబాద్ - కాకినాడ టౌన్- 12, 19వ తేదీల్లో(02 సర్వీసులు)
12. రైలు నెం.07079 : కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ - 12, 19వ తేదీల్లో(02 సర్వీసులు)
13. రైలు నెం. 07033 : చర్లపల్లి - నర్సాపూర్ - 7, 9, 13, 15, 17వ తేదీల్లో(05 సర్వీసులు)
14. రైలు నెం.07034 : నర్సాపూర్ - చర్లపల్లి - 8, 10, 14, 16, 18వ తేదీల్లో(05 సర్వీసులు)
15. రైలు నెం.07031 : చర్లపల్లి - కాకినాడ టౌన్ - 8, 10, 12, 14వ తేదీల్లో(04 సర్వీసులు)
16. రైలు నెం.07032 : కాకినాడ టౌన్ - చర్లపల్లి - 9, 11, 13, 15వ తేదీల్లో (04 సర్వీసులు)
17. రైలు నెం.07487 : నాందేడ్ కాకినాడ టౌన్- 6వ, 13వ తేదీల్లో(02 సర్వీసులు)
18. రైలు నెం.07488 : కాకినాడ టౌన్ - నాందేడ్ - 7, 14వ తేదీల్లో- (02 సర్వీసులు)
19. రైలు నెం.07025 : చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ - 9, 12, 14వ తేదీల్లో(03 సర్వీసులు)
20. రైలు నెం.07026 : శ్రీకాకుళం రోడ్ -చర్లపల్లి - 10, 13, 15వ తేదీల్లో (03 సర్వీసులు)
21. రైలు నెం.07041 : కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ - 7వ తేదీ (01 సర్వీస్)
22. రైలు నెం. 07042 : శ్రీకాకుళం రోడ్ - కాచిగూడ- 8వ తేదీలో (01 సర్వీస్)
సంబంధిత కథనం