Karimnagar Crime: తప్పుడు పత్రాలతో ఆస్తిని కాజేసిన తనయుడు, తల్లి, సోదరిని మోసం చేసిన నిందితుడి అరెస్ట్‌-son arrested for forging documents and cheating mother and sister ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Crime: తప్పుడు పత్రాలతో ఆస్తిని కాజేసిన తనయుడు, తల్లి, సోదరిని మోసం చేసిన నిందితుడి అరెస్ట్‌

Karimnagar Crime: తప్పుడు పత్రాలతో ఆస్తిని కాజేసిన తనయుడు, తల్లి, సోదరిని మోసం చేసిన నిందితుడి అరెస్ట్‌

HT Telugu Desk HT Telugu
Published Feb 18, 2025 09:46 AM IST

Karimnagar Crime: ఆస్తి కోసం కన్నవారిని తోబుట్టువులను మోసం చేసిన ఘటన కరీంనగర్ లో వెలుగులోకి వచ్చింది. తండ్రీ పేరిట ఉన్న ఆస్థిని కాజేసేందుకు తప్పుడు పత్రాలు సృష్టించి తండ్రీ డెత్ సర్టిఫికెట్ తీసుకుని ఘరానా మోసానికి పాల్పడిన కొడుకుతో పాటు అందుకు సహకరించిన ఆరుగురి పై కేసు నమోదు చేశారు.

తప్పుడు పత్రాలతో ఆస్తిని కాజేసిన తనయుడు అరెస్ట్‌
తప్పుడు పత్రాలతో ఆస్తిని కాజేసిన తనయుడు అరెస్ట్‌

Karimnagar Crime: తప్పుడు పత్రాలతో కన్న తల్లిని, సోదరిని మోసం చేసిన ఘనుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.తప్పుడు ఫ్యామిలీ ధృవ పత్రం, తండ్రి డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆస్తి కాజేసిన కొడుకును అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. కొడుకుతో పాటు ఇద్దరిని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.

కరీంనగర్ వన్ టౌన్ సిఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం...కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారం నిర్వహించిన జోరేపల్లి సుబ్బారెడ్డి 2014 లో మృతి చెందారు. ఆయనకు భార్య క్రిష్ణకుమారి, కొడుకు జోరేపల్లి ప్రదీప్ రెడ్డి (51), కూతురు సుచరిత (53) ఉన్నారు.

భర్త మృతి తర్వాత కృష్ణకుమారి హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ ఫార్చ్యూన్ మెజెస్టిక్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. తన భర్త సుబ్బారెడ్డి కరీంనగర్ లో గ్రానైట్, ఇతర వ్యాపారాలు చేస్తూ వచ్చిన ఆదాయంతో కరీంనగర్ చుట్టు పక్కల పలు చోట్ల భూముల కొనుగోలు చేశారు. 2014 అనారోగ్య కారణంగా భర్త సుబ్బారెడ్డి మరణించాడని హైదరాబాద్ అడ్రస్ ద్వారా బాధితురాలైన జోరేపల్లి క్రిష్ణకుమారి (77) మరణ ధ్రువీకరణ పత్రం పొందారు.

తరువాత కొంతకాలానికి తన కుమారుడైన హైదరాబాద్ హైటెక్స్ కి చెందిన జోరేపల్లి ప్రదీప్ రెడ్డి (51) తన తండ్రి సంపాదించిన ఆస్తిని ఒక్కడే కాజేయాలని దురుద్దేశంతో మోసానికి తెర లేపాడు. తప్పుడు పత్రాలు సృష్టించి తల్లిని, అమెరికా లో ఉండే సోదరిని మోసం చేసి ఆస్తులు కాజేశాడు.

ఐటి దాడుల పేరుతో....

ఇంట్లో ఐటీ దాడులు జరగబోతున్నావని తల్లిని నమ్మించాడు. తల్లి ఇంట్లో ఉన్న ఆస్తులకు సంబందించిన పత్రాలు, తండ్రి డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ దృవపత్రాలు అన్ని వెంట ధ్రువపత్రాలు తీసుకుని వెళ్లాడు. వాటి ఆధారంగా కరీంనగర్, చుట్టు ప్రక్కల తన తండ్రి సంపాదించిన ఆస్తులను చెల్లికి తల్లికి చెందకుండా కాజేయాలనే దురుద్దేశంతో కరీంనగర్ లోని చైతన్యపురి కి చెందిన ఇంటి నెంబర్ 2-10- 1760 తప్పుడు చిరునామాలో ఫ్యామిలీ సర్టిఫికెట్ నుంచి తన సోదరి సుచరిత పేరును తొలగించడంతో పాటు కరీంనగర్ లో తండ్రి మృతి చెందినట్లు మరొక డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు.

తల్లి, చెల్లికి తెలియకుండా సుల్తానాబాద్ లో గల 2 ఎకరాల 11 గుంటల భూమిని కాజేయడమే గాక తమకు గల గ్రానైట్ క్వారీ లీజును సైతం పూర్తిగా యాజమాన్యపు హక్కులు పొందగలిగాడు. తమకు తెలియకుండానే ఆస్తులన్ని కొడుకు పేరిట మారడంతో ఆరా తీసిన తల్లి తనయుడే మోసం చేశాడని పోలీసులకు పిర్యాదు చేసింది.

ఉద్యోగులతో సహా ఆరుగురిపై కేసు నమోదు...

కొడుకు మోసంపై తల్లి ఇచ్చిన పిర్యాదు తో కరీంనగర్ వన్ టౌన్ సిఐ కోటేశ్వర్ 92/2025, ఐపీసీ 61(2), 318(4), 338, 336(3), 340(2) r/w 3(5) of BNS, 2023 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. తప్పుడు ధ్రువ పత్రాలు జారీ చేసిన రెవిన్యూ అధికారులు, తప్పుడు సాక్షి సంతకాలు, అఫిడవిట్ దాఖలు చేసిన ఇతర ప్రభుత్వ శాఖ అధికారుల పై బాధితురాలైన జోరేపల్లి క్రిష్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.‌

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు నిజమేనని తేలినందున ప్రధాన నిందితులైన జోరేపల్లి ప్రదీప్ రెడ్డి (51) అతని స్నేహితుడైన సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లన అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెవిన్యూ, ఇతర శాఖల అధికారులపై విచారణ కొనసాగుతుందని సిఐ కోటేశ్వర్ తెలిపారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

HT Telugu Desk

Whats_app_banner

సంబంధిత కథనం