ఆపరేషన్ కగార్‌కు సన్‌స్ట్రోక్.. 40 మంది జవాన్లకు వడదెబ్బ.. వెంకటాపురం, భద్రాచలంలో చికిత్స-soldiers involved in operation kagar suffer from sunstroke in karre guttalu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఆపరేషన్ కగార్‌కు సన్‌స్ట్రోక్.. 40 మంది జవాన్లకు వడదెబ్బ.. వెంకటాపురం, భద్రాచలంలో చికిత్స

ఆపరేషన్ కగార్‌కు సన్‌స్ట్రోక్.. 40 మంది జవాన్లకు వడదెబ్బ.. వెంకటాపురం, భద్రాచలంలో చికిత్స

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లోని కర్రె గుట్టల్లో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్‌‌‌‌‌ను కొనసాగిస్తున్నాయి. సన్ స్ట్రోక్ సాయుధ బలగాలకు సమస్యగా మారింది. ఎండల తీవ్రత, సరిపడా తాగునీరు లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. సుమారు 40 మంది జవాన్లు వడదెబ్బకు గురయ్యారు. ప్రస్తుతం వారికి ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నారు.

ఆపరేషన్ కగార్‌కు సన్‌స్ట్రోక్ (unsplash)

క‌ర్రె గుట్ట‌ల్లో మావోయిస్టుల కోసం వేట కొన‌సాగుతోంది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, తెలంగాణ స‌రిహ‌ద్దుల్లోని ఈ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర‌నేత హిడ్మాతో పాటు ప‌లువురు ముఖ్య‌మైన నేతలు త‌ల‌దాచుకున్నార‌న్న స‌మాచారంతో.. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు విస్తృత‌మైన గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. గ‌త కొన్ని రోజులుగా కొన‌సాగుతున్న ఈ ఆప‌రేష‌న్‌లో ఇప్ప‌టికే ప‌లువురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. తాజాగా.. జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీక‌రించాల్సి ఉంది.

అణువ‌ణువునా గాలింపు..

భ‌ద్ర‌తా బ‌ల‌గాలు డ్రోన్లు, హెలికాప్ట‌ర్ల‌ను ఉప‌యోగిస్తూ అణువ‌ణువు గాలిస్తున్నాయి. గ్రేహౌండ్స్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ డీఆర్జీ, సీఆర్పీఎఫ్ వంటి వివిధ ద‌ళాలు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొంటున్నాయి. మావోయిస్టులు అమ‌ర్చిన మందుపాత‌ర‌ల‌ను గుర్తించేందుకు బాంబ్ డిస్పోజ‌ల్ స్క్వాడ్‌లు కూడా రంగంలో ఉన్నాయి. ఈ ప్రాంతం మావోయిస్టుల‌కు సుర‌క్షిత‌మైన స్థావరంగా ఉండ‌టంతో.. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అడుగ‌డుగునా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఆప‌రేష‌న్ ముగిసే వ‌ర‌కు ఈ ప్రాంతంలో ఉద్రిక్త ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశం ఉంది.

అన్ని వైపులా..

దాదాపు 10 వేల మందికి పైగా భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ చేస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచే కర్రె గుట్టలను అన్నీ వైపులా చుట్టుముట్టాయి. కర్రె గుట్టల చుట్టూ తూర్పున భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా చర్ల, దక్షిణాన ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలు, ఉత్తరాన పూజారి కాంకేర్‌‌‌‌, పశ్చిమాన ఇంద్రావతి నది ప్రాంతాల్లో కూంబింగ్‌‌‌‌ కొనసాగుతున్నది.

40 మందికి వడదెబ్బ..

అయితే గత మూడు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ములుగు జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బండరాళ్ల కారణంగా మరో రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 40 మందికి పైగా వడదెబ్బకు గురికాగా, ఆర్మీ హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌లో దగ్గర్లోని వెంకటాపురం, భద్రాచలం ప్రభుత్వ హాస్పిటళ్లకు తరలించారు. కొందరిని రోడ్డు మార్గాన వరంగల్‌‌‌‌‌‌‌‌కు పంపించి చికిత్స అందిస్తున్నారు.

గతంలోనూ ఇదే పరిస్థితి..

కర్రె గుట్టల్లో కూంబింగ్‌‌‌‌‌‌‌‌ చేయడం అతి పెద్ద సవాల్‌ అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు‌‌‌‌‌‌‌. గతేడాది జులైలో కూడా గుట్టల పైకి కూంబింగ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన భద్రతా బలగాలు.. ప్రతికూల వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఓవైపు ఎండ, మరోవైపు వానలో గుట్టలు ఎక్కుతూ దిగుతూ నాలుగు రోజుల పాటు 60 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈ క్రమంలో జవాన్లు నడవలేని స్థితికి చేరుకున్నారు. గుట్టల్లో చిక్కుకున్న వారందరినీ స్థానికుల సహాయంతో గుర్తించి.. ఆర్మీ హెలికాప్టర్లలో హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు తరలించాల్సి వచ్చింది.

సంబంధిత కథనం