TSPSC Paper Leak : ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో సిట్ సోదాలు-sit questions tspsc paper leakage accused in third day custody ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Sit Questions Tspsc Paper Leakage Accused In Third Day Custody

TSPSC Paper Leak : ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో సిట్ సోదాలు

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 08:34 PM IST

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తొమ్మిది మంది నిందితులు కస్టడీలో ఉన్నారు. సిట్ విచారణ చేస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (tspsc.in)

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులను సిట్ విచారణ(SIT Enquiry) చేస్తోంది. తొమ్మిది మంది నిందితులను కస్టడీలోకి తీసుకుని.. విచారణ చేస్తున్నారు అధికారులు. మూడోరోజు విచారణ కూడా జరిగింది. సాంకేతిక అంశాల ఆధారంగా.. మూడో రోజు ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా.. కీలక సమాచారం రాబట్టారు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ఇచ్చిన సమాచారం మేరకు పలువురిని విచారణ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రవీణ్, రాజశేఖర్ ఇంట్లో సోదాలు జరిగాయి. రేణుకతోపాటుగా మరో ఆరుగురిని కూడా విచారణ చేశారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా.. దర్యాప్తు చేస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్(Group 1 Prelims) అర్హత సాధించిన.. నలుగురు అనుమానితులను కూడా.. ఫోన్ ద్వారా విచారించినట్టుగా తెలుస్తోంది.

ఉదయం తొమ్మిది నుంచి నిందితులను రహస్య ప్రదేశంలో అధికారులు విచారించారు. మధ్యాహ్నం ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి మినహా.. ఏడుగురిని హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలాని తరలించి విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్ ను వారి వారి నివాసాలకు తీసుకెళ్లి సోదాలు చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు.

మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) ఘటనలో నిందితుడు రాజశేఖర్ భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజశేఖర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని వెల్లడించారు. వైద్య పరీక్షలు చేయించాలని కోర్టును కోరారు. కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కస్టడీ ముగిశాక కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షలు చేయిస్తామని కోర్టుకు చెప్పారు. సమస్య ఉంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది.

ఈ కేసులో సీబీఐ(CBI) విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత బల్మూరు వెంకట్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పేపర్ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్(KTR) పీఏ తిరుపతి పాత్రపై దర్యాప్తు జరిపించాలని కోరారు. గ్రూప్ 1 పేపర్ లో ఒకే జిల్లాకు చెందిన 20 మందికి అధిక మార్కులు రావడం అనుమానంగా ఉందని చెప్పారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా అనుమానాలకు కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం