Hyd Suicides: వరుసకు అక్కా తమ్ముళ్లు.. అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యలు..-sister and younger brothers suicides in suspicious circumstances ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Suicides: వరుసకు అక్కా తమ్ముళ్లు.. అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యలు..

Hyd Suicides: వరుసకు అక్కా తమ్ముళ్లు.. అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యలు..

HT Telugu Desk HT Telugu
Jan 24, 2024 08:14 AM IST

Hyd Suicides: హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. వరుసకు అక్కా,తమ్ముడు అయ్యే ఓ వివాహిత,యువకుడు ఇంట్లో వేరువేరు గదుల్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

హైదరాబాద్‌లో జంట ఆత్మహత్యలు
హైదరాబాద్‌లో జంట ఆత్మహత్యలు

Hyd Suicides: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన నరసింహ గౌడ్ ,సోమేష్ గౌడ్ అన్నదమ్ములు. 12 ఏళ్ల క్రితం బ్రతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చారు.

రాజేంద్రనగర్ సర్కిల్ లోని హైదర్గూడా కేశవ్ నగర్ లోని స్వంత ఇల్లు కట్టుకొని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. భవనం పై అంతస్తులో నరసింహ, స్వప్న దంపతులు, తమ ఇద్దరు కుమారులతో పాటు నరసింహ మేనమామ కుమారుడు స్వప్న సోదరుడైన శేఖర్‌తో కలిసి నివాసం ఉంటున్నారు.

కింది అంతస్తులో సోమేశ్ అతని భార్య స్రవంతి (28) ఇద్దరి కుమారులతో కలిసి ఉంటున్నారు. నరసింహ, సోమేశ్ అన్నదమ్ములు ఇద్దరు ప్రైవేట్ జాబ్ చేస్తుండగా మృతుడు శేఖర్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

హాల్‌లో అక్క… బెడ్రూంలో తమ్ముడు

మంగళవారం స్వగ్రామంలో బంధువు దశ దినకర్మ ఉండడంతో నరసింహ, సోమేశ్ తో పాటు స్వప్న వెళ్లారు. ఉదయం పిల్లలను స్కూల్లో వదిలి వెళ్లి వచ్చిన సోమేశ్ భార్య స్రవంతి ఇంట్లోనే ఉంది.

మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో స్రవంతి కుమారులు శశి చెందు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. గది లోపలకి వెళ్లి చూడగా తల్లి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. భయంతో పిల్లలు వెంటనే బయటికి వచ్చి పక్కింటి వారితో విషయం చెప్పారు. వారు భర్త సోమేశ్ తో పాటు పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా హాల్లో స్రవంతి, బెడ్రూంలో శేఖర్ ఉరేసుకొని విగత జీవులుగా కనిపించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఏ కారణంతో స్రవంతి, శేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారో తమకు తెలియడం లేదని, తామంతా కలిసిమెలిసి ఉండే వారిమని బంధువులు చెబుతున్నారు.

శేఖర్ గత ఐదేళ్లుగా తమ ఇంట్లోనే ఉంటున్నాడని వరుసకు తమకు మేనమామ కుమారుడు అవుతాడని నరసింహ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సోమేష్‌ దంపతులు పదేళ్ల క్రితమే వారు అత్తాపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. ఐదేళ్ల క్రితం గుమ్మకొండకాలనీలో సోదరుడు నర్సింహులుతో కలిసి సోమేష్‌ ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. మొదటి అంతస్తులో భార్యాపిల్లలతో కలిసి నర్సింహులు ఉంటుండగా కింది అంతస్తులో సోమేష్‌ కుటుంబం నివసిస్తోంది. సోమేష్‌ పలు కార్యాలయాలకు నీటిని సరఫరా చేస్తుండగా స్రవంతి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం..

రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ కథనం మేరకు గుంటూరు జిల్లా కోవెలమూడి గ్రామానికి చెందిన రామినేని రమేష్ బాబు (32) నగరంలోని రామచంద్రాపురంలో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.

మంగళవారం ఉదయం ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో సిలిండర్ తెచ్చుకునేందుకు స్కూటీపై మియాపూర్ లోనే తన స్నేహితుడి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో చందనగర్లోని క్రీంస్టోన్ ఐస్ క్రీమ్ షాప్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ డీసీఎం రమేష్ స్కూటీ ఢీ కొట్టింది.

బైక్ పైనుంచి కింద పడిన రమేష్ పైనుంచి డీసీఎం చక్రాలు వెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికులు గమనించి అతన్ని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.....పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

Whats_app_banner