Collector Teaching: బడిలో టీచర్లుగా పాఠాలు చెప్పిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్, ఎమ్మెల్యే కవ్వంపల్లి-sirisilla collector sandeep and mla kavvampalli who gave lessons as teachers in the school ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Collector Teaching: బడిలో టీచర్లుగా పాఠాలు చెప్పిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్, ఎమ్మెల్యే కవ్వంపల్లి

Collector Teaching: బడిలో టీచర్లుగా పాఠాలు చెప్పిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్, ఎమ్మెల్యే కవ్వంపల్లి

HT Telugu Desk HT Telugu
Aug 07, 2024 07:51 AM IST

Collector Teaching: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రొటిన్ కు భిన్నంగా మారారు. విధి నిర్వహణలో బడిబాట పట్టారు. పంతుళ్ళుగా మారి పిల్లలకు పాఠాలు బోధించారు.

బడిలో పాఠాలు చెబుతున్న సిరిసిల్ల కలెక్టర్, ఎమ్మెల్యే
బడిలో పాఠాలు చెబుతున్న సిరిసిల్ల కలెక్టర్, ఎమ్మెల్యే

Collector Teaching:

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రొటిన్ కు భిన్నంగా మారారు. విధి నిర్వహణలో బడిబాట పట్టారు. పంతుళ్ళుగా మారి పిల్లలకు పాఠాలు బోధించారు. పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టి టీచర్ల గుండెల్లో గుబులు పుట్టించారు. నాణ్యమైన విద్యను అందించి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.

ఇల్లంతకుంట మండలంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని కే.జీ.బీ.వీ విద్యాలయంను సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి పంతుళ్ళుగా మారారు. తరగతి గదుల్లోకి వెళ్ళి 6, 8, 10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు, గణితం, బౌతిక శాస్త్రాలను బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాల అడిగి తెలుసుకున్నారు. ఒక్కరు వృత్తి రీత్యా డాక్టర్ అయిన ఎమ్మెల్యే కవ్వంపల్లి, మరొకరు ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ ఇద్దరు ఉన్నత విద్యను అభ్యసించిన వారే కావడంతో పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టారు. విద్యా బోధన నాణ్యతపై ఆరా తీసి టీచర్ల గుండెల్లో గుబులు పుట్టించేంత పని చేశారు. విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్ ల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని టీచర్ లను ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పరిశీలించి పిల్లల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని సూచించారు. జాతీయస్థాయిలో షాట్ పుట్ పోటీలో పాల్గొన్న పదో తరగతి విద్యార్థులు అర్పిత, అంకిత లను సన్మానించారు. కేజీబీవీ భవనం పై అంతస్తు లో

అసంపూర్తిగా ఉన్నటువంటి డార్మటరీ నీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

*దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకై ఈనెల 10 వరకు క్యాంప్ లు*

అంతకు ముందు ఇల్లంతకుంట రైతు వేదికలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల గుర్తింపు క్యాంపును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే కవ్వంపల్లి సందర్శించి

ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలు సహాయ పరికరాలు పంపిణీ చేసేందుకు ఈనెల 5 నుంచి ఆగస్టు 10 వరకు ప్రతి రోజు మండలాల వారిగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. శారీరక దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్, చేతి కర్రలు, చంక కర్రలు, వీల్ చైర్లు ,మూడు చక్రాల సైకిల్, చెవిటి, మూగ దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, దృష్టిలోపం కల వారికి స్మార్ట్ కేన్ అందుల చేతి కర్ర అంద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్, మానసిక దివ్యాంగులకు యం.ఎస్.ఐ.ఇ.డి కిట్ లేదా యం.ఆర్.కిట్ పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దివ్యాంగులు తమ వెంట సదరం వైద్య ధృవీకరణ పత్రం లేదా 40% వికలాంగత్వం మించినట్లు ఫిజీషియన్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం, యూ.డి.ఐ.డి. కార్డు ధ్రువీకరణ పత్రం ఆహార భద్రత కార్డు ఆధార్ ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకొని రావాలని, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ పొందడానికి 80% వికలాంగత్వం, మిగిలిన ఉపకరణాలు పొందడానికి 40% వికలాంగత్వం ఉంటే సరిపోతుందని కలెక్టర్ తెలిపారు.

*అర్హులైన వారికి త్వరలో 2BHK ఇండ్ల పంపిణీ*

రైతు వేదిక ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం కింద మొక్కలు నాటిన ఎమ్మెల్యే కవ్వంపల్లి కలెక్టర్ సందీప్ కుమార్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు ఉన్నటువంటి రహదారి సమస్యను త్వరలో పరిష్కరించి పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ళు కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇల్లంతకుంట నుండి వెంకట్రావుపల్లి మీదుగా సిద్దిపేట వెళ్లే రహదారి మరమ్మతులు చేపట్టడం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి త్వరగా మరమ్మతు చర్యలు చేపట్టాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.