సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ప్రొటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఈ ఘర్షణలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహంతో బీఆర్ఎస్ నేతలపై దాడికి దిగారు. ఇరు వర్గాలు దాడికి యత్నించగా...పోలీసులు లాఠీఛార్జి చేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను చెదరగొట్టారు. ఇరువర్గాల తోపులాటతో సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ వేలికి గాయం అయింది.
పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీ ఛార్జ్ లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి సహా పలువురికి గాయాలయాయ్యి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వైఖరిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
సిరిసిల్ల నియోజకవర్గంలోని....అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో పెట్టకపోవడం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుండడంతో...బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ లు చేశారు.
సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో సిరిసిల్లలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ప్రోటోకాల్ పాటించాలని అడిగితే క్యాంపు కార్యాలయంపైకి దాడికి చేస్తారా? అంటూ బీఆర్ఎస్ నేతలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోసుంది. పోలీసులు చేసిన లాఠీచార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నాయకులపైనే లాఠీ ఛార్జ్ చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల లాఠీ ఛార్జ్ ను ఖండిస్తూ క్యాంపు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించీ రాస్తారోకో చేశారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని తంగలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
సంబంధిత కథనం