Singareni Recruitment 2024 : సింగరేణిలో 272 ఉద్యోగాలు - రాత పరీక్షల 'కీ' విడుదల, ఇదిగో లింక్-singareni recruitment key is available at https scclmines com direct link here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singareni Recruitment 2024 : సింగరేణిలో 272 ఉద్యోగాలు - రాత పరీక్షల 'కీ' విడుదల, ఇదిగో లింక్

Singareni Recruitment 2024 : సింగరేణిలో 272 ఉద్యోగాలు - రాత పరీక్షల 'కీ' విడుదల, ఇదిగో లింక్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 25, 2024 09:35 PM IST

Singareni Recruitment 2024 Updates : 272 ఉద్యోగాల భర్తీకి సంబంధించి సింగరేణి సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ముఖ్య వివరాలను వెల్లడించారు. మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

సింగ‌రేణి ఉద్యోగాలు - కీ విడుదల
సింగ‌రేణి ఉద్యోగాలు - కీ విడుదల

Singareni Recruitment 2024 Updates : సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల పాటు నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జులై 21వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించి… సింగరేణి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ‘కీ’ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటన చేశారు.

కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌ల "కీ" ని https://scclmines.com వెబ్ సైట్ లో పొందుప‌ర‌చ‌డం జ‌రిగిందని అధికారులు పేర్కొన్నారు. అభ్య‌ర్థుల‌కు ఏవైనా అభ్యంత‌రాలు ఉంటే జులై 27వ తేదీలోగా తెలిపే అవ‌కాశం ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు.

సింగరేణి సంస్థలో 272 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి రెండు రోజులపాటు పరీక్షలను నిర్వహించారు. 12 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 12,045 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థులు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను https://scclmines.com/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

సింగరేణి సంస్థలో 272 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి నెలలో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) పోస్టులు 139, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ) - 10, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ -10, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో–జియాలజిస్ట్‌) - 02, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) -18, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ) - 22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (పర్సనల్‌) - 22, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ - 3, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ - 30 ఉన్నాయన్నారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీస్‌ ట్రైనీ (సివిల్‌) - 16 పోస్టులు ఉన్నాయి.

ఆగస్టు 6, 7 తేదీల్లో పరీక్షలు…

సింగ‌రేణిలో మార్చి నెల‌లో జారీ చేసిన 2/2024 ఉద్యోగ‌ నోటిఫికేష‌న్ కు సంబంధించి కూడా అధికారులు మరో ప్రకటన చేశారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 7 ర‌కాల కేట‌గిరీ పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం పరీక్ష తేదీలను ఖరారు చేశారు. ఆగ‌స్టు 6, 7వ తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Whats_app_banner