Singareni Jobs 2024 : సింగరేణిలో 272 ఉద్యోగాలు - ప్రారంభమైన దరఖాస్తులు, లింక్ ఇదే
Singareni Recruitment 2024 Updates: ఇటీవలే 272 ఉద్యోగాల భర్తీకి సింగరేణి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది.
Singareni Recruitment 2024 Updates: సింగరేణి ఉద్యోగాల(Singareni Recruitment) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో 272 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్) పోస్టులు 139గాఉన్నాయి. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన అప్లికేషన్ల ప్రక్రియ… మార్చి 18వ తేదీ వరకు కొనసాగుతుంది. https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - సింగరేణి సంస్థ
ఖాళీలు - 272
ఖాళీల వివరాలు - ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్) పోస్టులు 139, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఐఈ) - 10, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ -10, మేనేజ్‌మెంట్ ట్రైనీ (హైడ్రో–జియాలజిస్ట్) - 02, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్) -18, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఏ) - 22, మేనేజ్‌మెంట్ ట్రైనీ (పర్సనల్) - 22, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ - 3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 30 ఉన్నాయన్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో సబ్ ఓవర్సీస్ ట్రైనీ (సివిల్) - 16.
వయోపరిమితి - వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు.( ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి మినహాయింపు ఇచ్చారు.)
పూర్తి స్థాయి నోటిఫికేషన్ ను మార్చి 1వ తేదీన వెబ్ సైట్ లో ఉంచుతారు.
దరఖాస్తులు - ఆన్ లైన్ విధానం
దరఖాస్తులు ప్రారంభం - మార్చి 1, 2024.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - మార్చి 18, 2024.
అధికారిక వెబ్ సైట్ - . https://scclmines.com/
ఇలా దరఖాస్తు చేసుకోండి…
అర్హత కలిగిన అభ్యర్థులు https://scclmines.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
కెరీర్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అనే కాలమ్ పై నొక్కాలి.
Apply Online అని కనిపించే ఆప్షన్ పై నొక్కితే… అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
అప్లికేషన్ ఫారమ్ లో మీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాలి.
చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ పూర్తి అవుతుంది.
దరఖాస్తు పూర్తి అయిన తర్వాత ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి అప్లికేషన్ కాపీని పొందవచ్చు.
రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు
RFCL Job Notification: రామగుండం ఫెర్టిలైజన్స్Fertilizers అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఈఐఎల్, ఎఫ్‌సిఐఎల్ జాయింట్ వెంచర్ సంస్థ అయిన రామగుండంఫెర్టిలైజర్స్ కంపెనీలో అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మార్చి 31వ తేదీలోగా దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయసు, అనుభవం వివరాలను పూర్తి నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
తాజా నోటిఫికేషన్‌లో కెమికల్ Chemicalవిభాగంలో ఇంజనీర్ పోస్టులు 11, మెకానికల్ ఇంజనీర్ పోస్టులు 5, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు 2, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ పోస్టులు 1, సీనియర్ కెమిస్ట్ కెమికల్ ల్యాబ్ 2 పోస్టులు, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 5, మెడికల్ ఆఫీసర్ పోస్టులు 1 భర్తీ చేస్తారు. మొత్తం 27 ఉద్యోగాలను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలు రూ.40,000-రూ.1,40,000 పే స్కేల్ మధ్య వేతనాలు ఉంటాయి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆర్‌ఎఫ్‌సిఎల్ వెబ్ సైట్ https://www.rfcl.co.in కెరీర్స్ విభాగంలో పూర్తి వివరాలను చూడవచ్చు.మార్చి 1 నుంచి నోటిఫికేషన్ అందుబాటులోకి రానుంది. మార్చి 31 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆర్‌ఎఫ్‌సిఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. నోటిఫికేషన్ సవరణ, అనుబంధ నోటిఫికేషన్, మార్పుల గురించి వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని ఆర్‌ఎఫ్‌సిఎల్ పేర్కొంది.