Mud Bath : మట్టి స్నానం చేయడం వలన అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆచార్యులు యోగా వంశీకృష్ణ అన్నారు. వారానికి ఒక్కసారి మట్టి స్నానం చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆచార్యులు యోగా వంశీకృష్ణ మాట్లాడుతూ ఆధునిక కాలంలో అనేక చర్మ సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నవారు ఈ మట్టి స్నానం ఆచరించడంతో ఉపశమనం లభిస్తుందన్నారు. మట్టి స్నానంతో శరీర ఉష్ణోగ్రత తగ్గించ బడడంతో పాటుగా, మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. పురాతన కాలం నుంచి తాను మట్టి స్నానం ఆచరించేవారన్నారు. ఈ యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల మట్టి స్నానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్ లో ఆదివారం యోగా గురువులు బొజ్జ ఆశోక్, ఎలిగేటి కృష్ణమూర్తి, పెద్ది మనోహార్ ఆధ్వర్యంలో మట్టి స్థానం కార్యక్రమం నిర్వహించారు. ఈ స్నానం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహనా కల్పించారు. మొదట కార్యక్రమానికి హాజరైన వారితో సూక్ష్మ యోగా ఆసనాల సాధన చేయిస్తూ వాటి ఉపయోగాలను వివరించారు. మట్టి స్నానం వలన కలిగే ఉపయోగాలను బోధించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారితో మట్టి స్నానం చేయించారు. నిత్యం మట్టి స్నానం చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి నెల మట్టి స్నానానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని యోగ గురువు బొజ్జా అశోక్ తెలిపారు. కాగా దీనికి ఆదరణ పెరుగుతుండడంతో చాల మంది సిద్దిపేట పౌరులు క్లబ్ లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. మానసిక,శారీరక ఆరోగ్యానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుందని,అధిక బరువు,నిద్ర లేమి,అజీర్ణం,మలబద్దకం,వంటి అనారోగ్యాలు దూరం అవుతాయని తెలిపారు.
క్రీడలతో మానసిక ఆరోగ్యం పెరుగుతుందని డీఈఓ రాధాకిషన్ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో బాలికల సబ్ జూనియర్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీలకు సంగారెడ్డి, సిద్దిపేట, నారాయణఖేడ్, గజ్వేల్ తదితర ప్రాంతాల నుంచి 110 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 20 మంది బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. వీరు ఈ నెల 12 నుంచి 14 వరకు కల్వకుర్తి పట్టణంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో ఉమ్మడి మెదక్ జిల్లా తరుపున పాల్గొంటారని తెలిపారు.
సంబంధిత కథనం