Siddipet News : సిద్దిపేటలో తీవ్ర విషాదం, కొండపోచమ్మ డ్యాంలో ఈతకు వెళ్లి ఐదుగురు మృతి
Siddipet News : సిద్దిపేట జిల్లాలో ఘోర విషాద ఘటన జరిగింది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈతకు వెళ్లి ఐదుగురు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
Siddipet News : సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈత కోసం వెళ్లిన ఐదుగురు యువకులు మృతి చెందారు. మొత్తం ఏడుగురు యువకులు డ్యాంలో దిగగా..ఐదుగురు గల్లంతయ్యారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఐదుగురి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
వారాంతం కావడంతో హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ సాగర్ జలాశయం చూసేందుకు వెళ్లారు. ఈత కొట్టేందుకు డ్యాంలో దిగారు. వీరిలో ఐదుగురు గల్లంతుకాగా...ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గల్లంతైన వారి కోసం గాలించారు. అప్పటికే ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులు ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జనిత్ పోలీసులు గుర్తించారు. ప్రమాద విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ధనుష్, లోహిత్ సొంత అన్నదమ్ములుగా తెలుస్తోంది. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కొండపోచమ్మ డ్యాంలో యువకుల గల్లంతుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులను అప్రమత్తం చేశారు. గల్లంతైన వారిని కాపాడటానికి గజ ఈతగాళ్లను రప్పించాలని ఆదేశించారు.
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిస్సా నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఐలాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 17 మంది ప్రయాణికులకు గాయపడ్డారు. వీరంతా కూలీ పనుల కోసం హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదంలో గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఒడిశాకు చెందిన కూలీలు పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత కథనం