Siddipet News : సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా, 200 మందికి ఉద్యోగాలు
Siddipet News : సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 28 కంపెనీలు పాల్గొన్నారు. 200 మందికి పైగా ఉద్యోగాలు లభించాయి.
Siddipet News : సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం టీఎస్కేసీ(Telangana Skills and Knowledge Centre) ఆధ్వర్యంలో డీఈఈటీ (Digital Employment Exchange of Telangana) సమన్వయంతో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 1,600 పైగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోసుకున్నారు. వీరిలో దాదాపు 900 మంది అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. జాబ్ మేళాలో 28 కంపెనీలలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కంపెనీలలో ఫార్మసీ, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, రిటైల్, ఫైనాన్స్ సాఫ్ట్ వేర్ కు సంబంధించిన ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 200 మందికి పైగా వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారని నిర్వాహకులు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
200 మందికి ఉద్యోగాలు
ఈ జాబ్ మేళా సమాచారాన్ని సామజిక మాధ్యమాల ద్వారా ఎక్కువ మందికి తెలిసేలా చేశామని టీఎస్కేసీ కోఆర్డినేటర్ డా.ఇమ్మడి శ్రీనివాసరావు తెలిపారు. గత 15 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఈ జాబ్ మేళా కోసం శిక్షణ ఇచ్చామన్నారు. జాబ్ మేళా ప్రారంభోత్సవంలో కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.సీహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాలలో స్థిరపడాలని కోరారు. డీఈఈటీ జనరల్ మేనేజర్ అనిల్ మాట్లాడుతూ... ఉద్యోగాల సాధన కోసం డీఈఈటీ ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ఈ జాబ్ మేళాలో 28 కంపెనీలలో వివిధ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఈ జాబ్ మేళాలో ఫార్మసీ, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, రిటైల్, ఫైనాన్స్ సాఫ్ట్వేర్ కు సంబంధించిన సంస్థలు పాల్గొన్నాయన్నారు. దాదాపుగా 200 మందికి పైగా వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించారని TSKC కోఆర్డినేటర్ డా.ఇమ్మడి శ్రీనివాస రావు తెలిపారు. టీఎస్కేసీ ఆధ్వర్యంలో కళాశాలలో ఇటువంటి జాబ్ మేళాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో కళాశాల NCC క్యాడెట్స్, NSS వాలంటీర్స్ సేవలను అందించారన్నారు.