TG ACB Trap: టిప్పర్ విడుదలకు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై, దళారీ జర్నలిస్ట్ సహా అరెస్ట్-si caught taking bribe for tippers release in medak ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Acb Trap: టిప్పర్ విడుదలకు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై, దళారీ జర్నలిస్ట్ సహా అరెస్ట్

TG ACB Trap: టిప్పర్ విడుదలకు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై, దళారీ జర్నలిస్ట్ సహా అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Jul 09, 2024 06:12 AM IST

TG ACB Trap: టిప్పర్ ను విడుదల చేయడానికి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఏసీబీకి దొరికిపోయాడు.

టిప్పర్ విడుదలకు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై
టిప్పర్ విడుదలకు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై

TG ACB Trap: ఇసుక టిప్పర్ రిలీజ్ చేయడానికి యజమాని నుండి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ అవినీతి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 28 న మెదక్ పట్టణానికి చెందిన పూల గంగాధర్ అనే వ్యక్తి ఇసుక టిప్పర్ ను పోలీసులు సీజ్ చేశారు.

ఆ కేసు విషయంలో గంగాధర్ తన టిప్పర్ రిలీజ్ చేయాలని పోలీసులను సంప్రదించాడు. దీంతో టిప్పర్ రిలీజ్ చేయాలంటే హవేలీ ఘన్పూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ గంగాధర్ ను రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇసుక టిప్పర్ యజమాని గంగాధర్ గత నెల 28 నాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో గంగాధర్ ఈ రోజు రూ. 20 వేలు ఎస్ఐ ఆనంద్ గౌడ్ కి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

హావేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్సైతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ మీడియా ప్రతినిధిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికి పత్రిక విలేకరి ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నిందితుల పాత్రపై విచారణ జరుపుతున్నారు.

కొరియర్ పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలి : సీపీ

ఫెడెక్స్ కొరియర్ ఇతర కొరియర్ పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలసీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ఫెడెక్స్ కొరియర్ ఇతర కొరియర్ పేరుతో సైబర్ నేరగాళ్లు డ్రగ్స్ ఉన్నాయని, పార్సల్స్ వచ్చాయని, ఢిల్లీ నార్కోటిక్, ముంబై నార్కోటిక్ పోలీసులమని యూనిఫాంలో వీడియో కాల్ చేస్తారు. డబ్బులు పంపించకపోతే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని బెదిరింపులకు గురిచేస్తారు. వారి బెదిరింపులకు భయపడి ఎవరు కూడా డబ్బులు పంపించి మోసపోవద్దని హెచ్చరించారు.

ఫెడెక్స్,లేదా ఇతర కొరియర్ల పేరుతో ఏవైనా కాల్స్ వస్తే వెంటనే సైబర్ సెల్ జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి పూర్తి వివరాలు తెలియజేయాలని తెలిపారు. మీరు ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే కొరియర్ కంపెనీలకు చెందినవారు మీ వివరాలు కనుక్కొని,మీ ఇంటికి వచ్చి అప్పుడే ఆర్డర్ చేసిన మీ పార్సల్ మీ చేతికి నేరుగా కొరియర్ అబ్బాయిలు అందజేస్తారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలియజేసారు.

WhatsApp channel