HCU Student Elections 2023 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో SFI కూటమి విజయం-sfi alliance win in uoh student polls in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hcu Student Elections 2023 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో Sfi కూటమి విజయం

HCU Student Elections 2023 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో SFI కూటమి విజయం

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 11, 2023 07:20 AM IST

University of Hyderabad Student Polls : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో SFI కూటమి విజయం సాధించింది. అన్ని ప్రధాన ఆఫీస్ బేరర్స్ పోస్టులను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది.

 SFI కూటమి ఘన విజయం
SFI కూటమి ఘన విజయం

University of Hyderabad Student Polls 2023 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీ విద్యార్ధి సంఘం 2023-2024 -గుర్తింపు ఎన్నికల్లో SFI ఆధ్వర్యంలో కూటమి ఆఫిస్ బేరర్స్ పోస్టులను గెలుచుకోని క్లీన్ స్వీప్ చేసి ABVP కూటమిపై ఘన విజయం సాధించింది.

  • అధ్యక్ష్య స్థానానికి మహ్మమద్ అతిక్ అహ్మద్ (SFI) -1880, షేక్ ఆయేషా (ABVP) -1409, ఉమేష్ అంబేద్కర్( ASD) -424, అమల్ జోష్ ఫిలిప్ (NSUI) -345, ఓట్లు పోందగా 471 ఓట్ల మెజారిటీతో SFI అభ్యర్థి మహ్మమద్ అతిక్ అహ్మద్ అధ్యక్షుడిగా గెలుపోందారు.
  • ఉపాధ్యక్ష స్థానానికి జలి ఆకాష్( SFI కూటమిలో భాగస్వామి ASA)- 1671, తరుణ్ (ABVP) -1283, రనియా జులైక (ASD) - 729, ముకుంద్ కుమార్ ( NSUI) -253 ఉపాధ్యక్ష స్థానంలో SFI కూటమి అభ్యర్థి జలి ఆకాష్ 388 ఓట్ల మెజారిటీ తో గెలుపోందారు.
  • ప్రధాన కార్యదర్శి స్థానానికి దీపక్ కుమార్ ఆర్య( SFI కూటమిలో భాగస్వామి ASA అభ్యర్థి) -1765, రాజేష్ పిల్లా( ABVP) -1285, అంజి (ASD) -432, శ్రీరామ్ యాదవ్ (NSUI) -384 ప్రధాన కార్యదర్శి స్థానంలో దీపక్ కుమార్ ఆర్య 480 ఓట్ల మెజారిటీ ఓట్లతో గెలుపోందారు.
  • సహాయ కార్యదర్శి స్థానానికి లావుడి బాలంజనేయులు( SFI కూటమిలో భాగస్వామి TSF అభ్యర్థి) - 1775, రాథోడ్ వసంత్ కుమార్ (ABVP) - 1134, శక్తి రజ్వార్ ( ASD) -421, చందన్ ధావర్ (NSUI) -296, సహాయ కార్యదర్శి స్థానంలో లావుడి బాలంజనేయులు 641 ఓట్ల మెజార్టీతో గెలుపోందారు.
  • సాంస్కృతిక కార్యదర్శి స్థానానికి షమిమ్ అక్తర్ షేక్( SFI కూటమిలోభాగస్వామి ASA అభ్యర్థి) -1656, అంతోని బసమథారి( ABVP) -1204, శ్రీద(NSUI) -519,సిహెచ్. శిల్ప (ASD) -416, సాంస్కృతిక కార్యదర్శిగా షమీమ్ అక్తర్ షేక్ 452 ఓట్ల మెజారిటీ తో గెలుపోందారు.
  • క్రీడా కార్యదర్శి స్థానానికి అతుల్ (SFI అభ్యర్థి)- 1642, జ్వాల ప్రసాద్(ABVP) -1406, మహ్మమద్ నద్రాన్. వి.(NSUI) -491, డి.శివ కుమార్(ASD) -409 క్రీడా కార్యదర్శిగా 236 ఓట్ల మెజారిటీ తో అతుల్ గెలుపోందారు.
  • జిఎస్ క్యాష్ ఇంట్రిగేటెడ్ లో SFI అభ్యర్థి నందన పలికిల్ ఎబివిపి అభ్యర్థి వజి.విన్సిక పై గెలుపోందారు, జిఎస్ క్యాస్( పిజి) లో SFI అభ్యర్థి కె.పూజ ,ఎబివిపి అభ్యర్థి అరుణ పై గెలుపోందారు, జిఎస్ క్యాష్ (రిసెర్చ్) లో SFI కూటమిలో భాగస్వామి ASA అభ్యర్థి సౌమ్య కెపి ,ఎబివిపి అభ్యర్థి పవన పై గెలుపోందారు. అన్ని ప్రధాన ఆఫీస్ బేరర్స్ పోస్టులను SFI కూటమి గెలుచుకున్నట్లు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలిపింది.

Whats_app_banner