వరంగల్- విజయవాడ మార్గంలో మూడో రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో పనులు జరుగుతున్న నేపథ్యంలో.. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు అందినట్లు అధికారులు చెబుతున్నారు.
కాజీపేట్- కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల పాక్షిక రద్దు, దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ మార్పులను అనుసరించి రైల్వే ప్రయాణికులు తమ రాకపోకలను సాగించాలని సూచించారు. ఈ నెల 23 నుంచి 29 వరకు.. డోర్నకల్- విజయవాడ(67767), విజయవాడ- డోర్నకల్ (67768), విజయవాడ- భద్రాచలం రోడ్ (బీడీసీఆర్) (67215), భద్రాచలం రోడ్(బీడీసీఆర్)- విజయవాడ (67216), గుంటూరు- సికింద్రాబాద్ (12705, సికింద్రాబాద్- గుంటూరు (12706), విజయవాడ- సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్- విజయవాడ (12714) రైళ్లను రద్దు చేశారు.
ఈ నెల 26న.. ఇండోర్- కొచ్చివెల్లి (22645), 24న.. కొచ్చివెల్లి- ఇండోర్ (22646), 28న.. కోర్బా- తిరువనంతపురం (22647), 26న.. తిరువనంతపురం- కోర్బా (22648), 23, 25న.. గోరఖ్‌పూర్- కొచ్చివెల్లి (12511), ఈ నెల 25, 27, 28న.. కొచ్చివెల్లి- గోరఖ్‌పూర్ (12512), 27, 28న.. విశాఖపట్నం-న్యూఢిల్లీ (20805), 27, 28న న్యూఢిల్లీ- విశాఖపట్నం (20806), 25న.. గాంధీధామ్- విశాఖపట్నం (20804), 24న.. హిస్సార్- తిరుపతి (04717), 26న.. తిరుపతి- హిస్సార్ (04718), ఈ నెల 26న.. సికింద్రాబాద్-తిరుపతి (07482) రైళ్లను విజయవాడ- వరంగల్ మార్గంలో రద్దు చేసి.. దారి మళ్లించారు. గుంటూరు- సికింద్రాబాద్ (17201), ఈనెల 23 నుంచి 29 వరకు, సికింద్రాబాద్- గుంటూరు (17202) ఈనెల 23 నుంచి 28 వరకు పాక్షికంగా రద్దు చేశారు.
విజయవాడ - సికింద్రాబాద్‌ల మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఈ రెండు నగరాల మధ్య రైళ్ల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు.. రైళ్ల వేగం కూడా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. మోటమర్రి - విష్ణుపురం మధ్య రెండో లైను నిర్మాణం కూడా జరుగుతోంది. ఇది పూర్తయితే.. సికింద్రాబాద్ నుండి విజయవాడకు కాజీపేట మీదుగా ఉన్న మార్గానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.
సంబంధిత కథనం