Telugu News  /  Telangana  /  Secunderabad Railway Station Passengers Downloading Pornographic Videos With Free Wifi In Railway Stations
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Free WIFI | ఇది దారుణం బ్రో.. రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై ఇస్తే.. అవే చూస్తారా?

05 June 2022, 17:38 ISTHT Telugu Desk
05 June 2022, 17:38 IST

ఆలోచన తింగరిగా ఉంటే.. చేసే పనులు కూడా అలాగా ఉంటాయంటారు. మంచికోసం.. తీసుకునే నిర్ణయాలను కూడా.. కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు. రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై ఇస్తే.. కొంతమంది వాటికోసం వాడేస్తున్నారు.

భారతీయ రైల్వే ఎంతో మంచి ఉద్దేశంతో చాలా రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై అందిస్తోంది. దీన్నే చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ కి వచ్చిన ప్రయాణికులు.. ఆ సేవలను వేరే వాటికోసం ఉపయోగించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక మన రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా దారుణం జరుగుతోంది. ఉచిత వైఫై ఉంది కదా అని.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కువగానే వాటిని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సంఖ్య దేశంలోనే ఎక్కువ.

ట్రెండింగ్ వార్తలు

ప్రయాణికుల సౌకర్యం కోసం ఇండియన్‌ రైల్వే ఉచిత వైఫై సేవలు అందిస్తోంది. రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైళ్ల సమాచారం, ఫ్లాట్‌ఫామ్‌ సమాచారం, ఆన్‌లైన్ టికెట్‌ బుకింగ్ లాంటి సేవల కోసం ఉచిత వైఫైని అందిస్తోంది. ఇలా వేలాది రైల్వే స్టేషన్‌లలో ఫ్రీ వైఫై ఉంది. సరిగా వాడుకునే ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కొంతమంది ప్రయాణికులు మాత్రం.. ఈ సేవను దుర్వినియోగం చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఫ్రీ వైఫై పోర్న్‌ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లుగా తేలింది.

రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం దేశంలోని సుమారు 6100 రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సేవలను తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ.. పలు రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సేవలు అందిస్తున్నారు. వీటిని రైల్‌ టెల్‌ నిర్వహిస్తోంది. అయితే ఫ్రీ వైఫై ఎలా వాడుకుంటున్నారు.. ఎంతమేరకు ప్రయాణికులకు ఉపయోగపడుతుందని.. రైల్ టెల్ అధికారులు ఆరా తీశారు. అలా ఈ దారణమైన విషయం బయటకు వచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై ద్వారా 35శాతం మంది అశ్లీల వీడియోలు చూస్తున్నట్టుగా తెలిసింది. తర్వాత స్థానంలో నాంపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి రైల్వే స్టేషన్‌లో కూడా ఇదే తరహాలో ఉచిత వైఫై సేవలు వాడుతున్నారు.

ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ ఫోన్‌ యూజర్స్‌ భారీగా పెరిగారు. అంతేకాదు.. రైల్వే స్టేషన్లలో ఇలాంటి పనులు చేస్తే.. ఎవరూ పట్టించుకోరనే కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరూ నిఘా పెట్టరు అనే ఆలోచనతో ఇలా.. 35 శాతం మంది పోర్న్ కంటెంట్ ఉన్న వీడియోలను డౌన్‌ లోడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రైల్వే ప్రయాణికులే ఇలా చేస్తున్నారా? లేదంటే.. కొంతమంది పనిపాటా లేని పోకిరీలు వచ్చి.. ఇలా మిస్ యూజ్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఫ్రీ వైఫై సేవలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని.. అధికారులు ఆలోచిస్తున్నారు.

టాపిక్