Nizamabad Scan Centre: నిజామాబాద్‌లోని ఓ స్కాన్ సెంటర్‌లో టెక్నిషియన్ దారుణానికి తెగబడ్డాడు. వైద్య పరీక్షల కోసం వచ్చే మహిళల్ని రహస్యంగా చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డాడు.
స్కానింగ్ కోసం వచ్చే మహిళలు, యువతులను రహస్యంగా చిత్రీకరించాడు. మహిళలు వైద్య పరీక్ష చేస్తుండగా అర్థనగ్నంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించాడు. ఆత తర్వాత వాటిని చూపించి వారిని బెదిరించే వాడు. ఈ క్రమంలో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో అతని నిర్వాకం బయటపడింది.
మహిళల్ని బెదిరిస్తున్న నిజామాబాద్‌లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్‌పై పోలీసులు నిఘా పెట్టడంతో అతని అకృత్యాలు బయటపడ్డాయి. బాధితుల్ని బెదిరించడంతో పాటు కొన్ని వీడియోలను మిత్రులకు షేర్ చేయడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఫొటోల్లో ఉన్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు స్కాన్ సెంటర్ ఉద్యోగి ఫోటోలు తీసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ స్కాన్ సెంటర్ అనుమతులు రద్దు చేయాలని, ఘటనపై వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య అధికారికి ఆదేశించారు. ఈ ఘటనలో బాధితులు ఎవరు ఉన్నా పోలీసులకు సమాాచారం ఇవ్వాలని సూచించారు.