TG Govt Holiday : తెలంగాణలోని ఈ జిల్లాల విద్యార్థులకు అలర్ట్ - రెండో శనివారం సెలవు రద్దు, రేపు స్కూళ్లకు వెళ్లాల్సిందే!
తెలంగాణలోని మూడు జిల్లాల్లో రెండో శనివారం సెలవు రద్దు అయింది.సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో యథావిధిగా రేపు (నవంబర్ 09) విద్యా సంస్థలు పని చేయనున్నాయి. మిగతా జిల్లాల్లో మాత్రం సెలవు ఉంటుంది.
తెలంగాణలోని మూడు జిల్లాల్లో రేపు ఇచ్చే రెండో శనివారం సెలవు రద్దైంది. సెప్టెంబర్ మాసంలో వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రేపు(నవంబర్ 9) అన్ని విద్యా సంస్థలు పని చేయనున్నాయి.
నవంబర్ 9వ తేదీని వర్కింగ్ డేగా పేర్కొంటూ ఆయా జిల్లాల అధికారులు ప్రకటన కూడా విడుదల చేశారు. రేపటి సెలవు రద్దు కావటంతో యథావిధిగా ఈ మూడు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలు పని చేయనున్నాయి.
సెప్టెంబర్ 17న వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ఇచ్చారు. మిగతా జిల్లాల్లో మాత్రమే విద్యా సంస్థలు పని చేశాయి. సెప్టెంబర్ 17వ తేదీన సెలవు ఇచ్చిన సందర్భంగా… నవంబర్ 9వ తేదీని వర్కింగ్ డే గా ప్రకటించారు . ఈ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఈ నవంబర్ 9వ తేదీన విద్యా సంస్థలు తెరిచి ఉండనున్నాయి.
15వ తేదీన సెలవు..!
ఇక ఈ నవంబర్ నెలలో 15వ తేదీన గురునానక్ జయంతి ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు హాలీడే రానుంది. ఇక డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు. కొన్ని స్కూళ్లకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుంది. మిగతా స్కూళ్లు తెరిచి ఉంటాయి. ఇక వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు వస్తాయి.
2025, ఫిబ్రవరి 28లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ లో తెలిపిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఏపీలో మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు ఇవ్వనున్నారు. సంకాంత్రి సెలవులు 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఇవ్వనున్నారు.
ఇక ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 28 నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. నిర్ణయించిన తేదీలలోపు కట్టకపోతే… ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది.నవంబర్ 12వ తేదీ నుంచి నవంబరు 18వ తేదీల్లో చెల్లిస్తే… రూ.50 అదనంగా కట్టాలి. ఇక నవంబర్ 19 నుంచి 25వ తేదీల్లో చెల్లిస్తే… రూ.200 అదనపు రుసుం చెల్లించాలి. నవంబర్ 26 నుంచి నవంబరు 30 వరకు రూ.500 ఆలస్య రుసుము చెల్లించాలి.
సంబంధిత కథనం