Sheep Distribution: గొల్ల, కురమలకు గుడ్‌ న్యూస్.. జూన్ 9 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ-second phase of sheep distribution to begin from june 9 in telangana ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Second Phase Of Sheep Distribution To Begin From June 9 In Telangana

Sheep Distribution: గొల్ల, కురమలకు గుడ్‌ న్యూస్.. జూన్ 9 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ

9 నుండి గొర్రెల పంపిణీ
9 నుండి గొర్రెల పంపిణీ

Sheep Distribution in Telangana:రెండో విడత గొర్రెల పంపిణీకి తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం చేసింది. జూన్ 5 నుంచి చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

Second Phase Sheep Distribution in Telangana: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. జూన్ 9 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం కానుంది. నకిరేకల్ లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. గొర్రెల యూనిట్ ల పంపిణీ, ఫిష్ ఫుడ్ ఫెస్టివల్, దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్షించారు.

ట్రెండింగ్ వార్తలు

గొర్రెల అభివృద్ధి పథకం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాల బ్రోచర్ లను స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. 8వ తేదీన హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దశాబ్ది ఉత్సవాలలో ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలని... గొర్రెల యూనిట్ ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు.

మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8, 9, 10 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. చేపలకు సంబంధించిన అన్ని రకాల వంటకాలు ఫెస్టివల్ లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. రాష్ట్ర పండుగను తలపించే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. ఇందుకు పశుసంవర్థక, మత్స్య, డెయిరీ అధికారులతో పాటు గోపాలమిత్రలకు కూడా భాగస్వాములను చేస్తున్నారు. మత్స్యరంగానికి విశేషంగా సేవలు అందించిన పలువురిని గుర్తించి సన్మానించనున్నారు. కొత్తగా లక్ష మందికి మత్స్య సొసైటీలలో సభ్యత్వాలు కల్పించేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.