హైదరాబాద్ - కన్యాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లు.... సర్వీసుల వివరాలివే-scr to run 8 weekly special trains between hyderabad and kanniyakumari ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్ - కన్యాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లు.... సర్వీసుల వివరాలివే

హైదరాబాద్ - కన్యాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లు.... సర్వీసుల వివరాలివే

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ - కన్యాకుమారి మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

సౌత్ సెంట్రల్ రైల్వే - ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - కన్యాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్స్…. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లల్లో ఆగుతాయని పేర్కొంది.

8 ప్రత్యేక రైళ్లు…

దక్షిణ మధ్య రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం…హైదరాబాద్ - కన్యాకుమారి (ట్రైన్ నెంబర్ 07230) మధ్య 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. జూలై 2 నుంచి జూలై 23వ తేదీల మధ్య వారంలో ఒకసారి రాకపోకలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైలు(07230) జూలై 2న (బుధవారం) సాయంత్రం 5.20 గంటలకు బయల్జేరుతుంది. శుక్రవారం ఉదయం 2.30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది.

ఇక కన్యాకుమారి - హైదరాబాద్ మధ్య మరో 4 రైళ్లు(ట్రైన్ నెంబర్ 07229) సర్వీసులు ఉంటాయి. ఈ ట్రైన్ కన్యాకుమారి నుంచి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 03.15 గంటలకు బయల్దేరుతుంది. శనివారం ఉదయం 2.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది. జూలై 4 నుంచి జూలై 25 తేదీల మధ్య ఈ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి.

ఆగే స్టేషన్లు ఇవే…

ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, చిదంబరం, కుంభకోణం, తంజావురు, కొడైకెనల్, మధురై, కొవిలిపట్టి, నాగర్ సోల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.