Hyderabad School Holidays : హైదరాబాద్‌లోని పాఠశాలలకు జనవరిలో తొమ్మిది రోజులు సెలవులు
Hyderabad School Holidays : హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు జనవరిలో తొమ్మిది రోజులు సెలవులు రాబోతున్నాయి. ఈ సెలవు రోజుల్లో నాలుగు ఆదివారాలు కూడా ఉన్నాయి. మిగతా రోజులు సెలవులు ఎందుకో ఇప్పుడు చూద్దాం.
కొత్త సంవత్సరం విద్యార్థులకు శుభవార్తను మోసుకొచ్చింది. జనవరి నెలలో ఏకంగా 9 రోజులు సెలవులు రాబోతున్నాయి. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో నాలుగు సాధారణ సెలవులు ఉన్నాయి. అవి నూతన సంవత్సర దినోత్సవం (జనవరి 1) అయిపోయింది. భోగి (జనవరి 13), సంక్రాంతి/పొంగల్ (జనవరి 14), గణతంత్ర దినోత్సవం (జనవరి 26)న సాధారణ సెలవులు ఉన్నాయి. గణతంత్ర దినోత్సవం సాధారణ సెలవు దినం. కానీ ఈ సంవత్సరం ఆదివారం వస్తుంది.
ఆదివారాలు, సాధారణ సెలవులు కాకుండా.. మూడు ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. అవి హజ్రత్ అలీ పుట్టినరోజు (జనవరి 14), కనుమ (జనవరి 15), షబ్-ఎ-మెరాజ్ (జనవరి 25). హజ్రత్ అలీ పుట్టినరోజు సెలవును ఐచ్ఛిక సెలవుగా జాబితా చేర్చారు. తెలంగాణలోని అన్ని పాఠశాలలను ఐచ్ఛిక సెలవుల్లో మూసివేయరు. కానీ.. షబ్-ఎ-మెరాజ్ సందర్భంగా చాలా మైనారిటీ పాఠశాలలకు సెలవు ఇస్తారు.
2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 27 సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇక 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
సాధారణ సెలవులు..
కొత్త సంవత్సరం – జనవరి 1, 2025
భోగి – జనవరి 13, 2025
సంక్రాంతి – జనవరి 14, 2025
రిపబ్లిక్ డే – జనవరి 26, 2025
మహా శివరాత్రి – ఫిబ్రవరి 26, 2025
హోలీ – మార్చి 14, 2025
ఉగాది – మార్చి 30, 2025
ఈద్ ఉల్ ఫితర్ – మార్చి 31, 2025
రంజాన్ – ఏప్రిల్ 1, 2025
బాబు జగ్జీవన్ రామ్ జయంతి – ఏప్రిల్ 5, 2025
శ్రీరామ నవమి – ఏప్రిల్ 6, 2025
అంబేడ్కర్ జయంతి – ఏప్రిల్ 14, 2025
గుడ్ ఫ్రైడే – ఏప్రిల్ 18, 2025
బక్రీద్ – జూన్ 7, 2025
మొహర్రం – జులై 6, 2025
బోనాలు – జులై 21, 2025
స్వాతంత్య్ర దినోత్సవం – ఆగస్టు 15, 2025
శ్రీ కృష్ణాష్టమి – ఆగస్టు 16, 2025
వినాయక చవితి – ఆగస్టు 27, 2025
ఈద్ మిలాదు నబీ – సెప్టెంబర్ 5, 2025
బతుకమ్మ మొదటి రోజు – సెప్టెంబర్ 21, 2025
దసరా/గాంధీ జయంతి – అక్టోబర్ 2, 2025
విజయదశమి తర్వాతి రోజు – అక్టోబర్ 3, 2025
దీపావళి – అక్టోబర్ 20, 2025
కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి – నవంబర్ 5, 2025
క్రిస్మస్ – డిసెంబర్ 25, 2025
క్రిస్మస్ తర్వాతి రోజు – డిసెంబర్ 26, 2025
ఆప్షనల్ హాలీడేస్..
హజరత్ అలీ పుట్టినరోజు - జనవరి 14
కనుమ - జనవరి 15
శ్రీ పంచమి - 3 ఫిబ్రవరి, 2025
షబ్ ఈ బరత్ - 14 ఫిబ్రవరి, 2025
మహవీర్ జయంతి - 10 ఏప్రిల్ 2025
అంబేడ్కర్ జయంతి - 14 ఏప్రిల్, 2025.