Cyber Crime: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళు, కలెక్టర్ పేరుతో నకిలీ ఖాతా, పోలీసులకు ఫిర్యాదు-scam cyber criminals fake account in the name of collector ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cyber Crime: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళు, కలెక్టర్ పేరుతో నకిలీ ఖాతా, పోలీసులకు ఫిర్యాదు

Cyber Crime: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళు, కలెక్టర్ పేరుతో నకిలీ ఖాతా, పోలీసులకు ఫిర్యాదు

HT Telugu Desk HT Telugu
May 27, 2024 01:08 PM IST

Warangal Cyber Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మొన్న వరంగల్ కలెక్టర్ పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి పలువురికి పంపిన కేటుగాళ్లు తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారు.

సిరిసిల్ల కలెక్టర్ పేరుతో నకిలీ అకౌంట్
సిరిసిల్ల కలెక్టర్ పేరుతో నకిలీ అకౌంట్

Cyber Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మొన్న వరంగల్ కలెక్టర్ పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి పలువురికి పంపిన కేటుగాళ్లు తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారు.

రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేశారు. శ్రీలంక దేశానికి చెందిన ఫోన్ నంబరు +94755455869 నెంబర్ తో ఏర్పాటు చేసిన నకిలీ ఖాతాలను సోషల్ మీడియా ద్వారా పలువురికి పంపిస్తున్నారు. వెంటనే కలెక్టర్ అప్రమత్తమయ్యారు.

జిల్లాలో సోషల్ మీడియాలో తన పేరిట వచ్చే తప్పుడు కథనాలు, ఫోన్ నంబరు నుంచి వచ్చే మోసపూరిత వాట్సప్ మెసేజ్ లను జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు నమ్మొ ద్దని కోరారు. జిల్లా కలెక్టర్ పేరిట మోసపూరిత మెసేజ్ లు పలు తప్పుడు కథనాలు, వాట్సప్, ఫేస్ బుక్ వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజలు వాటిని నమ్మడం గానీ, ఇలాంటి మెసేజ్ లను షేర్ చేయడంగానీ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

స్మార్ట్ ఫోన్ లు వాడే వారు తప్పక మొబైల్ యాప్లను వాడుతూనే ఉంటారు. పలు రకాల పనుల కోసం ఎన్నో రకాల వెబ్ సైట్ లను వినియోగిస్తుంటారు. దీంతో ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు లింక్ లను పంపి మోసాలకు తెరతీస్తున్నారు. అయితే ఇలాంటి అనుమానాస్పద వెబ్ సైట్ లింక్లను ఓపెన్ సోర్స్ సైబర్ టూల్స్ ను గుర్తించవచ్చని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్ సీఎస్టీ) అధికారులు చెబుతున్నారు.

సైబర్' ముప్పును గుర్తించండిలా

వెబ్ సైట్ల అక్షరాలు మారుస్తూ మోసాలు సైబర్ నేరగాళ్లు నిజమైన వెబ్సైట్లను పోలి ఉండేలా పేర్లు పెడుతూ మోసగిస్తుంటారు. ఉదాహరణకు 'yahoo.com'ను కొద్దిపాటి మార్పులతో అందులోని అక్షరాలకు సున్నాలు చేర్చి 'Yah00.com'గా మారుస్తుంటారు.

అలాగే అమెజాన్ వెబ్సైట్ కు AmaZO b.net' పెడుతున్నట్లు సైబర్ భద్రత నిపుణులు వివరిస్తున్నారు. నిజమైన వెబ్సైట్లను గుర్తించేందుకు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటర్నెట్ టూల్స్ సాయంతో.. ఒక వెబ్సైట్ సురక్షి తమైందో లేదో గూగుల్ సేఫ్ బ్రౌజర్ ట్రాన్సపరెన్సీ రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇందుకోసం https:// transparencyreport. google. com/ safe& browsing/search? hl= en లోకి వెళ్ళి మనం చెక్ చేయాలనుకొనే వెబ్ సైట్ యూఆర్ఎల్ ను నమోదు చేస్తే అది నిజమైనదో లేక నకిలీదో చిటికెలో తేలుస్తుంది. మనకు వచ్చిన లింక్ ని వెబ్సైట్లో ఉన్న కంపెనీ విశ్వసనీయత గురించి తెలుసుకునేందుకు https://www.bbb.org/ లో సెర్చ్ చేయవచ్చు. అలాగే isithacked, virustotal, phishtank, ftc, scamalert లాంటి ఓపెన్ సోర్స్ వెబ్సైట్లు, టూల్స్ తో నకిలీ వెబ్సైట్ల నుంచి వచ్చే వైరస్, ఫిషింగ్ లింక్ లు, మాల్ వేర్ లను గుర్తించొచ్చు.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

టీ20 వరల్డ్ కప్ 2024