TG SC Study Circle : ఎస్సీ స్టడీ సర్కిల్‌లో స్టాఫ్‌ ఉద్యోగాలు - ఎగ్జామ్ లేకుండానే భర్తీ, వివరాలివే-sc study circle invites applications for the various jobs 2024 in rajanna sircillla district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Sc Study Circle : ఎస్సీ స్టడీ సర్కిల్‌లో స్టాఫ్‌ ఉద్యోగాలు - ఎగ్జామ్ లేకుండానే భర్తీ, వివరాలివే

TG SC Study Circle : ఎస్సీ స్టడీ సర్కిల్‌లో స్టాఫ్‌ ఉద్యోగాలు - ఎగ్జామ్ లేకుండానే భర్తీ, వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 18, 2024 12:03 PM IST

Telangana SC Study Circle Jobs : తెలంగాణలోని ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఈ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. దరఖాస్తులకు ఆగస్టు 25వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉద్యోగాలు
ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉద్యోగాలు

రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నడిచే సిరిసిల్ల జిల్లాలోని ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. వీటిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొత్తం ఆరు ఖాళీలు ఉన్నాయి. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. https://rajannasircilla.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్, కోర్సు కో-ఆర్డినేటర్, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.

ముఖ్య వివరాలు :

ఉద్యోగ ప్రకటన -ఎస్సీ స్టడీ సర్కిల్, రాజన్న సిరిసిల్ల జిల్లా.

మొత్తం ఖాళీలు - 06.

ఖాళీల వివరాలు - ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్- 01, కోర్సు కో-ఆర్డినేటర్ 01, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 01, ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ - 06.

అర్హత: డిగ్రీ, పీజీ, 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించారు. కొన్ని పోస్టులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

జీతం - రూ. 22 వేల నుంచి రూ. 31 వేలు.

ఎంపిక విధానం - విద్యార్హతలు, ఇంటర్వ్యూ, పని అనుభవం తదితరాల తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం - ఆఫ్‌లైన్‌ లో చేయాలి.

పంపాల్సిన అడ్రస్ - దరఖాస్తులను జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల చిరునామాలో అందజేయాలి.

ఉద్యోగాల భర్తీకి దివ్యాంగుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ :

దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం ఆరు రకాల పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. పోస్టును బట్టి జీతాన్ని నిర్ణయించారు. ఆగస్టు 14వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. అయితే నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి పది రోజుల్లో అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్న బాలలకు విముక్తి కల్పించేందుకు హైదరాబాద్ లోని సైదాబాద్‌ జువైనల్‌ హోంలో మత్తు విముక్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ లో పని చేసేందుకు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు https://www.wdsc.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను " డైరెక్టర్, దివ్యాంగుల సంక్షేమ శాఖ, మలక్‌పేట క్రాస్‌రోడ్డు, హైదరాబాద్‌, పిన్ నెంబర్ - 500036 చిరునామాకు పంపించాలి. ఏమైనా సందేహాలు ఉంటే 040-245590480 నంబరును సంప్రదించవచ్చు.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ ప్రకటన శాఖ -దివ్యాంగుల సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
  • మొత్తం ఖాళీలు - 07
  • MSc Psychologist -02
  • డాక్టర్ - 01
  • స్పెషల్ ఎడ్యుకేటర్ - 01
  • అటెండర్ - 01,
  • యోగా, ఆర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్ థెరఫిస్ట్స్ - 01
  • స్వీపర్ - 01
  • జీతం - రూ. 5 - 60 వేల మధ్య ఉంటుంది. పోస్టును బట్టి వేతనాన్ని నిర్ణయించారు.
  • వయసు - 21 -35 ఏళ్ల లోపు ఉండాలి.
  • నోటిఫికేషన్ విడుదల తేదీ - ఆగస్టు 14, 2024.
  • పది రోజుల్లో దరఖాస్తు ఫారమ్ ను పైన పేర్కొన్న చిరునామాకు పంపాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://www.wdsc.telangana.gov.in/