TG SC Categorization: తెలంగాణలో నేటి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ… విధివిధానాలు ఖరారు, కాసేపట్లో జీవో విడుదల..
TG SC Categorization: తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది. ఇప్పటికే విధివిధానాలు, రిజర్వేషన్ల కేటయింపు ఖరారవగా మరికాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను వెలువరించనుంది. జీవో ప్రతిని మంత్రి వర్గ ఉపసంఘం ముఖ్యమంత్రికి అందచేయనుంది.
TG SC Categorization: తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది. ఇప్పటికే వర్గీకరణను తెలంగాణ అసెంబ్లీ అమోదించగా గెజిట్ విడుదలైంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ల అమలు విధివిధానాలు, మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది.
నేటి నుంచి అమల్లోకి వర్గీకరణ…
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది. సుదీర్ఘ కాలంగా సాగిన వర్గీకరణ ఉద్యమంతో గత ఏడాది సుప్రీం కోర్టు వర్గీకరణకు సానుకూలంగా తీర్పునివ్వడంతో తెలంగాణలో వర్గీకరణ కోసం ప్రత్యేక బిల్లును అసెంబ్లీ అమోదించింది. నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా వర్గీకరణ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జీవో తొలికాపీని సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు.
ఆదివారం హైద రాబాద్‌లో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సమావేశమయ్్యారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల డిమాండ్ నెరవేర్చినట్టు ఉత్తమ్ వివరించారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానాలను ఆమోదించినా, చట్టపర మైన మద్దతుతో అమలు చేయలేదని రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు.
మార్చి 18న వర్గీకరణ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇటీవల గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపారని వర్గీకరణ ఉత్తర్వులు, విధివిధానాలు సోమవారం విడుదల చేస్తున్నట్టు చెప్పారు. జీవో మొదటికాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని కమిటీ నిర్ణయించిందని సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు.
జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫా ర్చుల ఆధారంగా మార్గదర్శకాలను కమిటీ సమీక్షించి, జీవో జారీ చేయడానికి ఆమోదం తెలిపిందని గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు తరువాత అక్టోబరులో ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించగా జనాభా, అక్షరాస్యత, ఉన్నత విద్య ప్రవేశాలు, ఉపాధి, ఉద్యోగ, ఆర్ధిక సహాయం, రాజకీయ భాగస్వామ్యంపై కమిషన్ అధ్యయనం చేసింది.
ప్రాథమిక నివే దిక అనంతరం కొన్ని సంఘాలు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించేందుకు కమిషన్ పదవీ కాలాన్ని మరోనెల రోజులు పొడిగించి ప్రభుత్వం తుది నివేదిక తెప్పించుకుంది.
2026 జనగణన తరువాత...
తెలంగాణలో 2026 జనాభా లెక్కలు అందుబా టులోకి వచ్చిన తరువాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి వర్గ ఉపసంఘం ప్రకటించింది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని మంత్రులు తెలిపారు. తెలంగాణలో ఎస్సీ జనాభా 17.5 శాతానికి పెరిగింది. జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఆ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ వర్గీకర ణలో క్రీమీలేయర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సును ఇప్పటికే ప్రభుత్వం తిరస్కరించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయంతో షెడ్యూల్డ్ కులాల్లో (ఎస్సీ) బాగా వెనుకబడి, రిజర్వేషన్ల ఫలాలను సరిగా పొందలేకపోయిన కులాల కల నెరవేరుతుందని, రాష్ట్రంలో ఎస్సీలకు ఇప్పటివరకు గంపగుత్తగా అమలైన 15శాతం రిజర్వేషన్లు.. ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందుతాయి. నేటినుంచి ఎస్సీలలో గ్రూపులు, కులాల ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తారు.
సంబంధిత కథనం