సరస్వతి పుష్కరాలు- హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు, 40 మంది ఉంటే కాలనీలకే బస్సులు-saraswati pushkaralu tgsrtc special buses from hyderabad colony pickups for groups ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సరస్వతి పుష్కరాలు- హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు, 40 మంది ఉంటే కాలనీలకే బస్సులు

సరస్వతి పుష్కరాలు- హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు, 40 మంది ఉంటే కాలనీలకే బస్సులు

పన్నెండేళ్లకు ఒకసారి జరిగే సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నుంచి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 40 మంది కలసి పుష్కరాలకు వెళ్లాలని అనుకుంటే కాలనీలకే ప్రత్యేక బస్సులను పంపుతామని ఆర్టీసీ ప్రకటించింది.

సరస్వతి పుష్కరాలు- హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు, 40 మంది ఉంటే కాలనీలకే బస్సులు

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది.

హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల నుంచి

హైదరాబాద్ లోని జేబీఎస్,ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్ పల్లి, జీడిమెట్ల, మేడ్చల్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ప్రకటించింది. 40 మంది కలిసి పుష్కరాలకు వెళ్లాలని అనుకుంటే వారి కాలనీలకే ప్రత్యేక బస్సులను పంపేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది.

ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం https://www.tgsrtcbus.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించింది.

ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్రమైన సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేసే విధంగా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.

హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులు

గ్రేటర్ హైదరాబాద్ జోన్ టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం మే 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను సరస్వతి పుష్కరాలకు నడపనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ బస్సులు ప్రధాన పుష్కర ఘాట్లకు అందుబాటులో ఉండేలా ప్రణాళిక చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల (జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్పల్లి, జీడిమెట్ల, మేడ్చల్) నుంచి మెట్రో డీలక్స్ బస్సులు నడుపనున్నారు.

వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా, ఒకే కాలనీలో 40 మంది ప్రయాణికులు ఉంటే ఆ కాలనీకే బస్సు పంపిస్తారు. అలాంటి ప్రత్యేక బస్సుల కోసం 9676671533, 9959226154, 9959226160 నెంబర్లను ప్రయాణికులు సంప్రదించవచ్చు.

మే 15 నుంచి 26 వరకు- ఈ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు

  • హైదరాబాద్
  • ఉప్పల్
  • పార్కల్
  • భూపాలపల్లి
  • కరీంనగర్
  • జనగాం
  • మంథని
  • తొర్రూర్
  • మహబూబాబాద్
  • నర్సంపేట
  • హనుమకొండ
  • మంచిర్యాల
  • గోదావరిఖని

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం