TG Sankranti Holidays 2025 : తెలంగాణలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది..! ఈసారి ఎన్ని రోజులంటే..?
Telangana Sankranti Holidays 2025 : తెలంగాణలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది. పాఠశాలలకు జనవరి 11 నుంచి హాల్ డేస్ రానున్నాయి. జనవరి 16వ తేదీతో ఈ సెలవులు ముగియనున్నాయి. ఈసారి మొత్తం ఆరు రోజులు సెలువులు ఉండనున్నాయి.
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలా సంక్రాంతి సందడి మొదలవుతోంది. విద్యార్థులు కూడా సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది. అయితే తెలంగాణలో ఈసారి ఎన్నిరోజులు సెలవులు ఇస్తారనే దానిపై గందరగోళం నెలకొంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఈసారి కూడా ఆరు రోజులే…!
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. సంక్రాంతి మూడు రోజులు సెలవులు ఉంది. జనవరి 13వ తేదీన భోగి, జనవరి 14వ తేదీన సంక్రాంతి ఉంది. ఈ సెలవులను జనరల్ హాలీడేస్ గా పేర్కొంది. ఇక ఆప్షన్ హాలీ డేస్ కింద జనవరి 15వ తేదీన కనుమ ఉంది. ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం అయితే మూడు రోజులు మాత్రమే ఉంటుంది.
ఇక భోగికి ముందు అంటే జనవరి 11వ తేదీన రెండో శనివారం ఉంది. ఆ తర్వాత ఆదివారం కూడా సెలవు ఉండనుంది. అంటే జనవరి 11వ తేదీ నుంచే సంక్రాంతి సెలవులు ప్రారంభమైనట్లు అవుతుంది. అయితే ఈ సెలవులు జనవరి 16వ తేదీ వరకు ఉంటాయని తెలిసింది. జనవరి 17వ తేదీ నుంచి తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఒకవేళ ప్రభుత్వం జనవరి 15వ తేదీ వరకే నిర్ణయిస్తే… జనవరి 16వ తేదీనే స్కూళ్లన్నీ తిరిగి తెరుచుకుంటాయి.
సంక్రాంతి సెలవులు రాష్ట్రంలోని మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని బడులకు వర్తిస్తాయి. గతేడాదిలో చూస్తే… పాఠశాలలకు జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు వచ్చాయి. అంటే మొత్తం ఆరు రోజులు ఇచ్చారు. గతేడాది కనుమ మరునాడు కూడా సెలవు ఇచ్చి… 18వ తేదీన బడులను పునఃప్రారంభించారు. అయితే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సంక్రాంతి పండగకు ఆరు రోజులు సెలవులు ఉండనున్నాయి.
ఈ2025 ఏడాదికి గానూ సాధారణ, ఆప్షనల్ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఇటీవలనే ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇక 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.
సంబంధిత కథనం