Sangareddy Crime : సంగారెడ్డిలో దారుణం, లవ్ చేయడంలేదని కోడలు వరసైన యువతిపై బ్లేడుతో దాడి
Sangareddy Crime : తనను ప్రేమించడంలేదనే కోపంతో వరసకు కోడలయ్యే యువతిపై యువకుడు దాడి చేశారు. యువతి మేడ, చేయిపై స్వల్పగాయాలయ్యాయి. యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
Sangareddy Crime : సంగారెడ్డిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించడంలేదని యువకుడు ఓ యువతిపై బ్లేడుతో దాడి చేశారు. యువతి మెడ, చేతులపై గాయాలయినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం తిమ్మాపూర్‌కు చెందిన తెనుగు అఖిల(21)పై నారాయణఖేడ్ పరిధిలోని పోతంపల్లికి చెందిన ప్రవీణ్‌కుమార్ (22) బ్లేడుతో దాడి చేశాడు. అఖిల ప్రవీణ్ కు వరుసకు కోడలు అవుతుంది. అఖిల స్థానికంగా ఉన్న తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగో సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్ కాలేజీకి వెళ్లాడు. అక్కడ తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో యువతిపై దాడికి దిగాడు. ఈ దాడిలో అఖిలకు స్వల్ప గాయాలయ్యాయి. యువతిపై దాడిని గుర్తించిన తోటి విద్యార్థులు ప్రవీణ్‌కు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వైద్యుల ప్రాథమిక చికిత్స అనంతరం అఖిల పరీక్షకు హాజరైంది. పరీక్ష అనంతరం అఖిలను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. తనను ప్రేమించడంలేదనే కోపంతోనే ప్రవీణ్ దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇటీవలే మరో ఘటన
తన ప్రేమను ఒప్పుకోలేదని యువతి కళ్లలో కారం చల్లి కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్ ఎస్ఆర్నగర్లో ఇటీవల చోటుచేసుకుంది. ఈ దాడిలో యువతి మెడ, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువతి(28) బోరబండ పరిధిలోని బంజారానగర్‌లో నివాసం ఉంటుంది. స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో హౌస్‌కీపింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. బోరబండ మోతీనగర్‌కు చెందిన కిశోర్ షాపింగ్అదే షాపింగ్ మాల్లోనే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వీరికి గత ఆరేళ్లుగా పరిచయం ఉంది. తనను ప్రేమించాలని కిశోర్ ఆమె వెంటపడుతూ వేధించేవాడు. ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్హెచ్చరించారు. ఇటీవలే యువతి మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది.
ప్రేమించడంలేదని కత్తితో దాడి
ఈ విషయం తెలుసుకున్న కిశోర్, యువతిపై మరింత కక్ష పెంచుకున్నాడు. దీంతో ప్లాన్ ప్రకారం యువతిపై దాడి చేసేందుకు నిర్ణయించుకున్నారు. యువతి షాపింగ్ మాల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా బంజారానగర్‌లో అడ్డుకున్నాడు. యువతి కళ్లలో కారం చల్లి కత్తితో దాడి చేశాడు. యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె మెడ, ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి కిశోర్ ను పట్టుకున్నారు. యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. యువతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన వివరాల ప్రకారం ృపోలీసులు.. కిశోర్‌పై కేసు నమోదు చేశాడు. తనను ప్రేమించడంలేదనే కారణంతో దాడి చేసినట్లు కిశోర్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.