Sangareddy Church Collapse : సంగారెడ్డి జిల్లాలో విషాదం, నిర్మాణంలో ఉన్న చర్చి కూలి నలుగురు మృతి!
Sangareddy Church Collapse : సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చి కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు.

Sangareddy Church Collapse : సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కోహిర్ మండలంలో నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలి నలుగురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు శిథిలాల్లో చిక్కుకున్నారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. బాధితులలో నలుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని లాలా కుంటలో నూతన మెథడిస్ట్ చర్చి నిర్మాణపు పనుల్లో ప్రమాదం జరింది. స్లాబ్ కు సపోర్టుగా ఉన్న చెక్కలకు పక్కకు జరిగి స్లాబ్ కూలిపోయింది. 130బై50 ఫీట్లు ఉన్న ఈ స్లాబ్ ను 40 ఫీట్ల ఎత్తులో వేశారు. దీంతో స్లాబ్ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు గాయపడ్డారు. వారిని ముందు కోహిర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
లారీ ఢీకొట్టిన టీఎస్ఆర్టీసీ బస్సు-ఇద్దరు మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు నెల్లూరు జిల్లాలో ప్రమాదానికి గురైంది. మాచర్ల సమీపంలో ఆదివారం తెల్లవారుజామున టీఎస్ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనాస్థలంలోని మృతిచెందారు. మృతులను బస్సు డ్రైవర్ వినోద్ (45), ప్రయాణికురాలు సీతమ్మ (65)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు... మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.