Compensation For Revathi Family : సంధ్య థియేటర్ తొక్కిసలాట, రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ప్రకటించిన పుష్ప టీమ్
Compensation For Revathi Family : సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ రూ.2 కోట్లు పరిహారం ప్రకటించింది. హీరో అల్లు అర్జున్ రూ.కోటి, సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించార
Compensation For Revathi Family : పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి కుటుంబానికి పుష్ప మూవీ టీమ్ రూ.2 కోట్ల పరిహారం ప్రకటించింది. హీరో అల్లు అర్జున్ రూ.1 కోటి, డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. సినీ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు. రూ.2 కోట్ల చెక్కును ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజుకు అందించినట్లు అల్లు అరవింద్ తెలిపారు.
పుష్ప టీమ్ పరిహారం ప్రకటన
సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితురాలు రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్...హీరో అల్లు అర్జున్ తరఫున రూ.కోటి, పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ చెక్కులను దిల్ రాజుకు అందించారు అల్లు అరవింద్. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, పుష్ప 2 నిర్మాత రవిశంకర్‌తో కలిసి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి...శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలుడి తండ్రి భాస్కర్‌తో నిర్మాతలు మాట్లాడారు. అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు.
శ్రీతేజ్ కోలుకుంటున్నాడని అల్లు అరవింద్ తెలిపారు. బాలుడి వెంటిలేషన్ తీసేశారని, త్వరలోనే మనందరి మధ్య తిరుగుతాడని ఆశిస్తున్నామన్నారు. లీగల్ టీమ్ సూచనల వల్ల బాధితుల కుటుంబ సభ్యులను కలవలేకపోతున్నామన్నారు. అన్ని రకాల అనుమతులు తీసుకుని శ్రీతేజ్‌ను 10 రోజుల క్రితమే పరామర్శించానన్నారు.
సీఎంతో సమావేశం ఖరారు
శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త మెగురుపడిందని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారన్నారు. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప 2 నిర్మాతలు, డైరెక్టర్ ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగామని, సినీ ప్రముఖులు సీఎంను కలిసి చర్చిస్తామన్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు వెళ్లి సీఎంను కలుస్తామన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అవుతామన్నారు.
సంబంధిత కథనం