(1 / 7)
Medaram Jatara | భక్తుల దర్శనార్థం మేడారం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క - సారలమ్మలు. భక్తజనం తన్వయత్వంతో మురిసిపోయి, తమ ఆరాధ్య దైవాలకు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు. అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
(2 / 7)
Medaram Jatara | వనదేవతలు కొలువుదీరడంతో మేడారం భక్తజనసంద్రంతో నిండిపోయింది. లక్షలాది భక్తుల జయజయ ధ్వానాలతో మేడారం మారుమోగుతోంది.
(3 / 7)
Medaram Jatara | మేడారం మహా జాతరలో అత్యంత కీలకఘట్టమైన సమ్మక్క ఆగమనం అంగరంగ వైభవంగా జరిగింది.
(4 / 7)
Medaram Jatara | భక్తుల తాకిడి అడ్డుకునేలా వందల మంది పోలీసులు, వాలంటీర్లతో భారీ బందోబస్తు నడుమ సమ్మక్క ఊరేగింపు
(5 / 7)
Medaram Jatara | కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను తోలుకొస్తున్న పూజరులను తాకితే అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం.
(6 / 7)
చిలకలగుట్ట నుంచి సమక్క రాక సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆమెకు స్వాగతం పలికారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సంగ్రామ్‌సింగ్ పాటిల్ సమ్మక్క అమ్మ రాకను సూచిస్తూ AK-47 తో గాలిలోకి 2 రౌండ్లు కాల్పులు జరిపి సమ్మక్కకు గౌరవ వందనం సమర్పించారు.
(7 / 7)
Medaram Jatara | జంపన్న వాగులో స్నానాలు.. ఎక్కడ చూసినా గుడారాలు, అశేష భక్తజనంతో నిండిపోయిన మేడారం దారులు
ఇతర గ్యాలరీలు