Salman Khan : 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో పాల్గొన్న సల్మాన్ ఖాన్-salman khan participated in green india challenge at hyderabad ramoji film city
Telugu News  /  Telangana  /  Salman Khan Participated In Green India Challenge At Hyderabad Ramoji Film City
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్

Salman Khan : 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో పాల్గొన్న సల్మాన్ ఖాన్

22 June 2022, 17:20 ISTHT Telugu Desk
22 June 2022, 17:20 IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. హైదరాబాద్ కు షూటింగ్ కోసం వచ్చారు.

ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ ను అందిస్తుందన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0'లో పాల్గొన్నారు.

మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సల్మాన్ కోరారు. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమన్నారు. ఆ పనికి జోగినిపల్లి సంతోష్ కుమార్ 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ద్వారా బాటలు వేశారన్నారు. దాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని తెలిపారు. అభిమానులంతా విధిగా 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

<p>సల్మాన్ ఖాన్ తో ఎంపీ సంతోష్ కుమార్</p>
సల్మాన్ ఖాన్ తో ఎంపీ సంతోష్ కుమార్

అనంతరం రాజ్యసభ సభ్యుడు.., జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడారు. పెద్ద మనసుతో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే వచ్చి మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. మొక్కలు నాటడం వల్ల కోట్ల మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.

<p>గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సల్మాన్ ఖాన్</p>
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సల్మాన్ ఖాన్

సంబంధిత కథనం

టాపిక్