శబరిమల ఆలయం తెరుచుకుంది. అయ్యప్పను దర్శించుకునేందుకు స్వాములు కొండకు వెళ్తున్నారు. శబరిమల యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీ అందిస్తోంది. సికింద్రాబాద్ నుంచి శబరిమలకు 5 రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఈ పర్యటనలో శబరిమల, చోటా నిక్కర్ దేవాలయాలను దర్శించుకోవచ్చు.
సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ రైలు ద్వారా శబరిమల యాత్ర ప్యాకేజీ అందిస్తున్నారు. 2AC, 3AC, SL తరగతులలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు శబరిమల తదుపరి పర్యటన నవంబర్ 16న అందుబాటులో ఉంది.
క్లాస్ | పెద్దలకు | పిల్లలకు(5-11 సంవత్సరాలు) |
ఎకానమీ క్లాస్ | రూ.11475 | రూ.10655 |
స్టాండర్ట్ | రూ.18790 | రూ.17700 |
కంఫర్ట్ | రూ.24215 | రూ.22910 |
DAY- 01 : ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ లో భారత్ గౌరవ్ ట్రైన్ శబరిమల యాత్రకు బయలుదేరుతుంది. నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ప్రయాణికుల బోర్డింగ్ ఉంటుంది.
DAY-02 : చెంగనూర్ - స్టేషన్ నుంచి యాత్రికులను పికప్ చేసి నీలక్కల్‌కు రోడ్డు మార్గంలో తీసుకెళ్తారు. నీలక్కల్ నుంచి పంబా వరకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి. మీరు సొంతంగా శబరిమల (సన్నిదానం) దర్శనానికి వెళ్లాలి. అలాగే https://sabarimalaonline.org/ వెబ్‌సైట్ లో వర్చువల్ క్యూ రిజర్వేషన్‌ను ప్రయాణికులు ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. వర్చువల్ క్యూ రిజిస్ట్రేషన్ కోసం ఫొటో, ఫోటో గుర్తింపు కార్డు సాఫ్ట్ కాపీలు అవసరం.
DAY-03 శబరిమల - చోటా నిక్కర్ - శబరిమల సన్నిదానం దర్శనం, అభిషేకం అనంతరం నీలక్కల్ చేరుకుంటారు. అక్కడి నుంచి చొట్టనిక్కర/ఎర్నాకులం వెళ్లి రాత్రి బస చేస్తారు.
DAY-04 : చోటా నిక్కర్ - ఉదయం 07:00 గంటలు చొట్టానిక్కర ఆలయాన్ని సందర్శిస్తారు. 08:00 గంటలకు ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్‌కి రోడ్డు మార్గంలో బయలుదేరతారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎర్నాకులం నుంచి సికింద్రాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.
DAY-05 : ప్రయాణికుల డీబోర్డింగ్, సికింద్రాబాద్ కు రాత్రి 9.45 గంటలకు రైలు చేరుకుంటుంది. దీంతో పర్యటన ముగుస్తుంది.
సంబంధిత కథనం