Rythu Bandhu : 3వ రోజు 5.49 లక్షల రైతులు.. రూ.687.89 కోట్లు..-rupees 687 cr deposited in farmers accounts on third day under rythu bandhu scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Rupees 687 Cr Deposited In Farmers Accounts On Third Day Under Rythu Bandhu Scheme

Rythu Bandhu : 3వ రోజు 5.49 లక్షల రైతులు.. రూ.687.89 కోట్లు..

HT Telugu Desk HT Telugu
Dec 30, 2022 03:44 PM IST

Rythu Bandhu : పదో విడత రైతుబంధు నిధుల జమ కొనసాగుతోంది. 3వ రూ. 687.89 కోట్లు.. 5.49 లక్షల మంది కర్షకుల ఖాతాల్లో జమయ్యాయి.

రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం
రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం

Rythu Bandhu : Rythu Bandhu: యాసంగి పంట సాయం కింద ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పదో విడతలో భాగంగా.. డిసెంబర్ 28న, తొలి రోజు 1 ఎకరం వరకు ఉన్న 22.45 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లో రూ. 758 కోట్లు జమ చేసిన అధికారులు.. డిసెంబర్ 29న, రెండో రోజు.. 2 ఎకరాల వరకు ఉన్న 15.96 లక్షల మంది రైతుల అకౌంట్లలో.. రూ. 1,218.38 కోట్లు డిపాజిట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

మూడో రోజు.. డిసెంబర్ 30న... రూ. 687.89 కోట్లు కర్షకుల ఖాతాల్లో జమ చేశారు. 3వ రోజు.. 13 లక్షలా 75 వేల 786 ఎకరాలకు గాను.. 5.49 లక్షల మంది రైతులు .. రైతుబంధు నిధులు అందుకున్నారు. ఇలా.. రోజుకో ఎకరం పెంచుతూ.. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి లోపు.... రాష్ట్రంలో ప్రతి రైతుకి రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా.. నిధుల జమలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేశారు. పదో విడతలో మొత్తం కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు రైతు బంధు అందనుంది.

రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 9 విడతల్లో సాయం అందించగా... ఇప్పుడు జమ చేస్తోన్న నిధులు పదో విడత. ఈ విడతలో 70.54 లక్షల మంది రైతులకి ఎకరానికి రూ. 5 వేల చొప్పున రూ. 7,676.61 కోట్లు ప్రభుత్వం అందించనుంది. 9 విడతల్లో కలిపి ఈ పథకం కింద రూ. 57, 882 కోట్లు పంపిణీ చేయగా... పదో విడతతో రూ. 65, 559.28 కోట్లు ఈ కార్యక్రమం కింద వెచ్చించినట్లు అవుతుంది.

గత వానాకాలం 65 లక్షల మంది రైతులకు రూ.7434.67 కోట్ల నిధులని అందించింది ప్రభుత్వం. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన మరో 5 లక్షల మంది .. పదో విడతకు అర్హత పొందారు. దీంతో.. లబ్ధిదారుల సంఖ్య 70.54 లక్షలకు చేరింది. రైతు బంధుతో పాటు.. రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు రూ. 5 లక్షల బీమా లభిస్తుంది. ఎల్ఐసీ ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రైతు ఏ కారణంతో అయినా మరణిస్తే.. రూ. 5 లక్షల బీమా సొమ్ముని 15 రోజుల్లో కుటుంబీకులకి అందిస్తున్నారు.

IPL_Entry_Point