వారంతా పెళ్లికి వెళ్తున్నారు..! కొన్ని గంటల్లో కల్యాణ మండపానికి చేరుకునేవారు. ఇంతలోనే వారు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మూడు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిది. అంతేకాదు వరుడితో పాటు పలువురికి గాయాలయ్యాయి. దీంతో పెళ్లి కార్యక్రమం వాయిదా పడింది. ఈ విషాదం ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
ఓ పెళ్లి బృందం బుధవారం రాత్రి నాందేడ్ నుంచి బయల్దేరింది. వారు హుజూరాబాద్‌కు రావాల్సి ఉంది. ఈ క్రమంలో కొండగట్టు వద్దకు రాగానే… వారి కారును డీసీఎం ఢీకొట్టింది. కారులో ఉన్న చిన్నారి మృతి చెందింది. వరుడితో పాటు మరికొందరికి గాలయ్యాయి. వరుడైన మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు.
మరికొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లి కార్యక్రమం వాయిదా పడింది. అనుకోని రోడ్డు ప్రమాదంలో వరుడైన మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనికితోడు చిన్నారి ప్రాణాలు కోల్పోవటంతో పాటు మరికొందరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో… పెళ్లి కార్యక్రమం ఆగిపోయింది. ఈ ఘటన ఇరు కుటుంబాల్లోనూ విషాదం నింపింది.