Jagityal Accident: జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొన్న కారు, మహిళా ఎస్సై దుర్మరణం
Jagityal Accident: జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మహిళా ఎస్సై మృతి చెందారు. మోటర్ సైకిల్‌ను తప్పించే క్రమంలో చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఎస్సైతో పాటు బైక్ ప్రయాణిస్తున్న యువకుడు కూడా మృతి చెందాడు.
Jagityal Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఎస్సై నడుపుతున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళా ఎస్ ఐ శ్వేతతో పాటు మరొకరు మృతి చెందారు.

గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న 2020 బ్యాచ్ కి చెందిన ఎస్ఐ శ్వేతతో పాటు బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. గతంలో వెల్గటూర్, కోరుట్ల, పెగడపల్లి, కథలాపూర్ స్టేషన్లలో శ్వేత ఎస్సైగా విధులు నిర్వర్తించారు.
ఇటీవల కోరుట్ల నుంచి జగిత్యాల డిసిఆర్బీకి బదిలీ అయ్యారు. సోమవారం రాత్రి స్వగ్రామం చొప్పదండి మండలం ఆర్నకొండకు వచ్చి ఉదయం జగిత్యాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయే క్రమంలో చెట్టును బలంగా ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో సీటు బెల్టు పెట్టుకోక పోవడంతో స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు. బైకు వస్తున్న వ్యక్తి మల్యాల మండలం ముత్యంపేట నరేష్ గా గుర్తించారు.