Mallareddy MLRIT: దుండిగల్‌లో మల్లారెడ్డి అల్లుడి కాలేజీని కూల్చేసిన అధికారులు.. సిఎం సలహాదారుడితో మల్లారెడ్డి చర్చలు…-revenue officials demolished mallareddy son in law college in dundigal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mallareddy Mlrit: దుండిగల్‌లో మల్లారెడ్డి అల్లుడి కాలేజీని కూల్చేసిన అధికారులు.. సిఎం సలహాదారుడితో మల్లారెడ్డి చర్చలు…

Mallareddy MLRIT: దుండిగల్‌లో మల్లారెడ్డి అల్లుడి కాలేజీని కూల్చేసిన అధికారులు.. సిఎం సలహాదారుడితో మల్లారెడ్డి చర్చలు…

Sarath chandra.B HT Telugu
Mar 07, 2024 12:23 PM IST

Mallareddy MLRIT: చెరువు భూమిని ఆక్రమించి కాలేజీ నిర్మాణం చేపట్టిన మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి రెవిన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. భారీ బందోబస్తు మధ్య దుండిగల్‌లో ఆక్రమిత భూముల్లో కాలేజీని కూల్చేశారు.

మల్లారెడ్డి అల్లుడి కాలేజీని కూల్చేస్తున్న రెవిన్యూ సిబ్బంది
మల్లారెడ్డి అల్లుడి కాలేజీని కూల్చేస్తున్న రెవిన్యూ సిబ్బంది

Mallareddy MLRIT: మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నాయకుడు మల్లారెడ్డి Ex minister Mallareddy కి రెవిన్యేూ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని కూల్చేశారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి నిర్వహిస్తున్న ఎంఎల్‌ఆర్‌ఐటి MLRIT లో ప్రభుత్వ భూములు ఉన్నాయని గుర్తించిన రెవిన్యూ అధికారులు గురువారం ఉదయాన్నే భారీ బలగాల మధ్య వాటిని కూల్చేశారు.

భవానాలను కూలుస్తున్న సమయంలో కాలేజీ సిబ్బంది రెవిన్యూ అధికారులను Revenue Dept అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని హెచ్చరించడంతో సిబ్బంది భవనాలను కూల్చివేత Demolish కొనసాగించారు. చెరువు భూమిని ఆక్రమించి నిర్మాణాలను చేపట్టినట్టు రెవిన్యూ అధికారులు వివరించారు.

దుండిగల్‌ ఎంఎల్‌ఇఆర్‌టి కాలేజీని చిన్న దామర చెరువులో నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బిఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాలేజీపై చర్యలు తీసుకోడానికి అధికారులు సాహసించలేదు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలను చేపట్టిన వారిపై కఠిన చర్యలు ప్రారంభించారు.

ఈ క్రమంలో మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి చిన్నదామర చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే అభియోగాలతో భవనాలను కూల్చివేశారు. మేడ్చల్‌, దుండిగల్ ప్రాంతంలోని బఫర్‌ జోన్ నిర్మాణాలను తొలగించారు.

మల్లారెడ్డికి చెందిన కాలేజీల కూల్చివేత నేపథ్యంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సలహాదారు నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ అయ్యారు. అల్లుడు రాజశేఖర్‌ రెడ్డితో కలిసి  నరేందర్ రెడ్డి కార్యాలయానికి వచ్చిన  మల్లారెడ్డి చర్చలు జరిపారు. రెండు గంటలకు పైగా  ఈ భేటీ కొనసాగింది.  తాజా పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది

మల్లారెడ్డి బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరకముందు టీడీపీలో కొనసాగారు. ఆ తర్వాత బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరి మంత్రి పదవి పొందారు. మంత్రిగా ఉన్న సమయంలో పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకున్నారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేశారు.  2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి రేవంత్‌ రెడ్డి  ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక సయోధ్య కోసం మల్లారెడ్డి ప్రయత్నాలు చేశారు.  తాజాగా ఆయన కాలేజీలపై దాడులు జరగడంతో  సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. 

Whats_app_banner