CM Revanth Reddy Speech : ఇనుప కంచెలు బద్దలు కొట్టాం - రేపట్నుంచే ప్రజాదర్భార్ - CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన-revanth reddys first speech after assuming charge as chief minister of telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Revanth Reddy's First Speech After Assuming Charge As Chief Minister Of Telangana

CM Revanth Reddy Speech : ఇనుప కంచెలు బద్దలు కొట్టాం - రేపట్నుంచే ప్రజాదర్భార్ - CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 07, 2023 02:12 PM IST

CM Revanth Reddy News: సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేపట్నుంచే ప్రజా భవన్ లో ప్రజా దర్భార్ నిర్వహిస్తామని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Speech : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన ఆయన… తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. అన్ని ప్రాంతాల్లో సమానమైన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

"ప్రగతి భవన్ వద్ద ఉన్న ఇనుప కంచెలను బద్ధలు కొట్టించాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాటిస్తున్నాను. నా తెలంగాణ కుటుంబ ప్రజలు ఎప్పుడు రావాలనుకున్నా... ప్రగతి భవన్ లోకి రావొచ్చు. ప్రజలు వారి ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవచ్చు. జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో రేపే ప్రజాదర్భార్ నిర్వహిస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో సోనియామ్మ అండతో ప్రజలకు మేలైన సంక్షేమంతో పాటు అభివృద్ధిని చూసి చూపిస్తాం. పాలకులం కాదు సేవకులం అనే విధంగా పని చేస్తాను. కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటాను" అని రేవంత్ రెడ్డి చెప్పారు.

“పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసింది. దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా... ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

WhatsApp channel