Revanth Reddy | ప్రశాంత్‌కిశోర్‌ను సీఎం కేసీఆర్ అందుకే తెచ్చుకున్నారు-revanth reddy on cm kcr over job notifications ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy | ప్రశాంత్‌కిశోర్‌ను సీఎం కేసీఆర్ అందుకే తెచ్చుకున్నారు

Revanth Reddy | ప్రశాంత్‌కిశోర్‌ను సీఎం కేసీఆర్ అందుకే తెచ్చుకున్నారు

HT Telugu Desk HT Telugu
Feb 28, 2022 08:32 AM IST

ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఆయన ఇంట్లోనే.. అందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నారని విమర్శించారు. కేసీఆర్ కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.

<p>నిరుద్యోగ నిరసన దీక్షలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి</p>
నిరుద్యోగ నిరసన దీక్షలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి (twitter)

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరై దీక్షను విరమింపచేశారు. ఎన్నో వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కేసీఆర్.. తర్వాత వాటిని మారిచిపోయారని.. రేవంత్ రెడ్డి అన్నారు. తన ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయ్యాక.. కేసీఆర్ భయపడుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకోసమే.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. ప్రగతిభవన్‌ను అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా మారుస్తామని చెప్పారు. ఏడాదిలోపై 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

'కాంగ్రెస్, ఇతర ప్రజాసంఘాల నేతల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాంది పలికితే.. కేసీఆరే స్వరాష్ట్ర పోరాటం చేసినట్లు అవాస్తవాలు చెబుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన అజెండాగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాం. కానీ కేసీఆర్‌ ఇంట్లో మాత్రమే.. ఉద్యోగాలు వచ్చాయి. ఏడేళ్లకాలంలో లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించి ఉంటే... బిశ్వాల్‌ కమిటీ ప్రకారం లక్షా 90వేల ఖాళీలు ఎందుకున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. ప్రగతిభవన్‌ను అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా మార్చడంపైనే తొలి సంతకం పెడ్తాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

అధికారంలోకి వచ్చాక.. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ పదవికి రాజీనామాకు చేయాలని టీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారని.. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీలో అందరూ కలిసి నడిస్తేనే అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం