Revanth reddy: మోదీని ప్రశ్నించే ఛాన్స్ వచ్చింది.. కేసీఆర్ ఎందుకు బహిష్కరించారు?-revanth reddy fires on cm kcr over boycott niti aayog meeting
Telugu News  /  Telangana  /  Revanth Reddy Fires On Cm Kcr Over Boycott Niti Aayog Meeting
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫొటో)
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫొటో) (twitter)

Revanth reddy: మోదీని ప్రశ్నించే ఛాన్స్ వచ్చింది.. కేసీఆర్ ఎందుకు బహిష్కరించారు?

06 August 2022, 18:53 ISTMahendra Maheshwaram
06 August 2022, 18:53 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులపై మోదీని ప్రశ్నించే అవకాశం ఉన్న నీతి ఆయోగ్ సమావేశాన్ని ఎందుకు బహిష్కరించారని ప్రశ్నించారు

Revanth reddy fires on cm kcr: సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశన్ని బహిష్కిరించడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రధాని మోదీ, కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉందని మరోసారి నిరూపితమైందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో ప్రధానిని నేరుగా ప్రశ్నించే అవకాశం వచ్చినప్పటికీ... కేసీఆర్ ఎందుకు వినియోగించుకోవటం లేదన్నారు.

ఏడున్నరేళ్లుగా మోదీతో కలిసి నడిచిన కేసీఆర్... మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతునన్నప్పటికీ.. అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని రేవంత్ విమర్శించారు. కేంద్రంలోని ప్రభుత్వం ఈడీ, సీబీఐని ఎలా వాడుకుంటుందో... అలాగే తెలంగాణలో కూడా దర్యాప్తు సంస్థలను కేసీఆర్ వాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో వేధిస్తున్నారని విమర్శించారు.

'రేపటి నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరై నిధుల గురించి ప్రస్తావిస్తారని భావించాం. కానీ కేసీఆర్ బహిష్కరించటం సరికాదు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలకు కేసీఆర్ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు నేరుగా ప్రశ్నించే అవకాశాన్ని వదులుకున్నారు. మోదీకి కేసీఆర్ ఏకలవ్య శిష్యుడు. ఇప్పటికైనా మరోసారి కేసీఆర్ పునరాలోచన చేయాలని. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాలని ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ తరపున సూచన చేస్తున్నాం' అని రేవంత్ రెడ్డి చెప్పారు.

చేరికలపై రియాక్షన్...

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా నడిచిందని...కానీ బీజేపీలో అలాంటి పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. బీజేపీ కండువా కప్పుకున్న రోజే సంతోషం ఉంటుందని... తర్వాత అసలు విషయం తెలుస్తుందని చెప్పుకొచ్చారు. బీజేపీ పార్టీ మరికొంత మంది కోవర్టులను తయారు పార్టీ మారుతున్న వాళ్లకు కాలమే సమాధానం చెబుతోందని వ్యాఖ్యానించారు.

కోమటిరెడ్డికి ప్రశ్నలు...

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు పశ్నలు సంధించారు రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి కంపెనీకి బొగ్గు టెండర్ వచ్చిందా లేదా..? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కమీషన్లలో భాగస్వామ్యం ఉందా లేదా..? 2009లో నేరుగా వచ్చి ఎంపీగా నామినేషన్ వేశారా..? లేక పార్టీ కోసం అంతకంటే ముందు ఏమైనా పని చేశారా..?మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ కోసం మనోహర్ రెడ్డి చాలా రోజులుగా పని చేస్తున్నాడు. ఆయనకు టికెట్ ఇస్తావా లేక నువ్వే పోటీ చేస్తావా..? సోనియా, రాహుల్ గాంధీని గౌరవిస్తున్నానని చెప్పావ్. అలాంటి వ్యక్తులను ఈడీ విచారణ పేరుతో వేధిస్తుంటే... అమిత్ షాను ఎలా కలుస్తావ్..? అంటూ సూటిగా నిలదీశారు.