Revanth Reddy Comments : వాళ్లకు వీపు విమానం మోతే.. రేవంత్ రెడ్డి ఫైర్-revanth reddy comments in munugode by poll campaign ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Revanth Reddy Comments In Munugode By Poll Campaign

Revanth Reddy Comments : వాళ్లకు వీపు విమానం మోతే.. రేవంత్ రెడ్డి ఫైర్

మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి (twitter)

Munugode By Election : ప్రజలు ఓట్లేసి గెలిపించారని, కొంతమంది పశువులలాగా అమ్ముడుపోయారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అమ్ముడుపోయిన నేతలను ఆదరించొద్దని కోరారు.

మునుగోడు(Munugode) నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్(TRS), బీజేపీ(BJP)పై విమర్శలు చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నపార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి పోయారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి ఎలా జరుగుతుందో రాజగోపాల్ రెడ్డికే తెలియాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

'ఎవరైనా కాంగ్రెస్ పార్టీ(Congress Party) మారాలని బెదిరిస్తే వాళ్లు ఎంతటి వాళ్లైనా వీపు విమానం మోత మోగుతుంది. ఓట్ల రూపంలో వారిని చిత్తు చిత్తుగా ఓడించాలి. పేదల కోసం కాంగ్రెస్ చేసిన పనులను గుర్తు పెట్టుకోవాలి. చీర నేసే పని కూడా సిరిసిల్ల(Siricilla)కే పోతోంది. ఈ విషయంమై ఇక్కడ ఉన్న పద్మశాలీ సోదరులు ఆలోచించాలి. పేదల కోసం కాంగ్రెస్ చేసిన పనులను గుర్తు పెట్టుకుని నిర్ణయం తీసుకోండి. కాంగ్రెస్‌కు అండగా నిలబడి గెలిపించాలి. నాలుగు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీని గెలిపిస్తే మార్పు ఏం రాలేదు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

మహిళలంటే కేసీఆర్(KCR)​కు చిన్నచూపని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఒక ఆడబిడ్డకు మునుగోడు(Munugode)లో ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇవ్వాలని కోరారు. మీ సమస్యలపై కొట్లాడి మీ వైపు నిలబడుతుందన్నారు. ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టాలని, ఆడబిడ్డల శక్తిని చూపించాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు.

ఓటుకు రూ.30 వేలు, మరొకరు రూ.40వేలు ఇస్తామని గొప్పలు చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇవన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. జగదీశ్ రెడ్డి మంత్రిగా ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క డబుల్ బెడ్ ​రూమ్(Double Bed Room Houses) ఇల్లైనా ఇచ్చారా అని అడిగారు. రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదన్నారు.

'చీర నేసే పని కూడా సిరిసిల్లకు పోయింది. పేదల కోసం కాంగ్రెస్ చేసిన పనులను గుర్తు పెట్టుకోవాలి. నాలుగు ఉప ఎన్నిక(By Poll)ల్లో టీఆర్ఎస్, బీజేపీని గెలిపిస్తే మార్పు ఏం రాలేదు. ఆడబిడ్డకు మునుగోడులో ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇవ్వాలి. ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టాలి.. ఆడబిడ్డల శక్తిని చూపించాలి.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం