Congress : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క-revanth reddy and bhatti vikramarka named star campaigners for maharashtra and jharkhand elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క

Congress : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క

Basani Shiva Kumar HT Telugu
Nov 04, 2024 03:54 PM IST

Congress : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. వారిలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. మహారాష్ట్రకు రేవంత్, జార్ఖండ్‌కు భట్టి వెళ్లనున్నారు.

రేవంత్, భట్టి
రేవంత్, భట్టి (X)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. రేవంత్ మహారాష్ట్రలో ర్యాలీలకు నాయకత్వం వహించనునుండగా.. భట్టి జార్ఖండ్‌లో ప్రచారం చేయనున్నారు.

కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన శరద్ పవార్ వర్గం, శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ, వామపక్ష పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా బ్లాక్ అభ్యర్థుల కోసం భట్టి విక్రమార్క జార్ఖండ్‌లో ప్రచారం చేయనున్నారు.

మహారాష్ట్రకు చెందిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణ నాయకుడు. జార్ఖండ్ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుండి భట్టి ఏకైక ప్రతినిధిగా ఉన్నారు. నవంబర్ 8 నుంచి 18వ తేదీలోపు ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో ఈ వారంలో వీరి ప్రచార షెడ్యూల్ ఖరారవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.

అప్ దూరం..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. పోటీకి దూరంగా ఉండనున్న ఆప్.. ఇండియా కూటమికి మద్దతు ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయడం లేదని.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మహా వికాస్ అఘాడీ కూటమి తరుఫున ప్రచారం చేస్తారని.. ఆ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.

మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్..

నోటిఫికేషన్ వెలువడు తేదీ: 22/10/ 2024

నామినేషన్ల దాఖలకు చివరి తేదీ: 29/10/ 2024

నామినేషన్ల పరిశీలన: 30/10/ 2024

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 04/11/ 2024

పోలింగ్ జరుగు తేదీ: 20/11/ 2024

కౌంటింగ్ తేదీ: 23/11/ 2024

మహారాష్ట్ర: 288 అసెంబ్లీ సీట్లు(జనరల్‌-234, ఎస్సీ-29, ఎస్టీ- 25)

మొత్తం ఓటర్ల సంఖ్య: 9 కోట్ల 63 లక్షలు

Whats_app_banner