Singareni Recruitment Results 2024 : సింగరేణి ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల - ఇదిగో లింక్
సింగరేణిలో 272 ఎక్స్‌టర్నల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 10 విభాగాల్లో 272 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది జులై 20, 21న జరిగిన పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక జాబితాను https://scclmines.com వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
సింగరేణిలో 272 ఎక్స్‌టర్నల్ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది జులైలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన కీలు కూడా వచ్చాయి. తాజాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సింగరేణి సంస్థ వెల్లడించింది. https://scclmines.com వెబ్ సైట్ లో ఫలితాల జాబితాను పొందుపరిచినట్లు అధికారులు ప్రకటించారు.
సింగరేణి సంస్థలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి రెండు రోజులపాటు పరీక్షలను నిర్వహించారు. జులై 20, 21 తేదీల్లో 12 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 12,045 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో విడుదలైంది.ఇందులో ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్) పోస్టులు 139, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఐఈ) - 10, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ -10, మేనేజ్‌మెంట్ ట్రైనీ (హైడ్రో–జియాలజిస్ట్) - 02, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్) -18, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఏ) - 22, మేనేజ్‌మెంట్ ట్రైనీ (పర్సనల్) - 22, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ - 3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 30 ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో సబ్ ఓవర్సీస్ ట్రైనీ (సివిల్) - 16 పోస్టులు ఉన్నాయి.