TG Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితా విడుదల ఆలస్యమయ్యే అవకాశం, 26న పథకం ప్రారంభం-release of indiramma illu beneficiaries list likely to be delayed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితా విడుదల ఆలస్యమయ్యే అవకాశం, 26న పథకం ప్రారంభం

TG Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితా విడుదల ఆలస్యమయ్యే అవకాశం, 26న పథకం ప్రారంభం

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 24, 2025 09:47 AM IST

TG Indiramma Illu: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితా విడుదల ఆలస్యం కానుంది. జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత లబ్దిదారుల జాబితా విడుదల చేస్తారని ప్రకటించినా ఆ రోజు జాబితాలు విడుదల కాకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. పథకాన్ని ప్రారంభించి తేదీలో జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం

TG Indiramma Illu: తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న లబ్దిదారుల ఎంపికలో ప్రజల ఆందోళనలు, అభ్యంతరాలు పెరుగుతున్న నేపథ్యంలో లబ్దిదారుల ఎంపికకు మరితం సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

yearly horoscope entry point

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నియోజక వర్గానికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది అర్హులను గుర్తించి జనవరి 26 న ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న గ్రామస భల్లో అర్హుల జాబితాను ప్రకటిస్తు న్నారు. లబ్దిదారుల జాబితాను ప్రకటించడం లేదు. అర్హుల జాబితాలో తమ పేర్లు లేవని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 26న ప్రభుత్వం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయి కసరత్తు తర్వాత లబ్దిదారుల జాబితాను (నియోజకవర్గానికి 3,500మందిని ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్దఎత్తున దరఖాస్తులు అందుతున్నాయి. ఇప్పటికే కు సుమారు 8 లక్షల దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చాయి. వీటిని కూడా సమగ్రంగా పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి జాబితాపై దృష్టి సారిం చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ఏడాది ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. లబ్ధిదా రుల ఎంపిక కోసం గ్రేటర్ హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100 శాతం యాప్ సర్వే నిర్వహించారు. ఇళ్ల కోసం తాము దరఖాస్తు చేసినా స్థల పరిశీలిన కోసం సర్వేయర్లు ఎవరూ రావడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసిన వారు కూడా వీరిలో ఉండే అవకాశం ఉంది. ఏడాది నాలుగున్నర లక్షల మందికి ఇళ్లను నిర్మించాలని ప్రబుత్వం భావిస్తోంది.

ప్రభుత్వం మొదటి విడతలో సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించింది. తెలంగాణలో సొంతింటి స్థలం ఉన్న వారు 13 లక్షల మంది ఉన్నట్లు యాప్ సర్వేలో గుర్తించారు. నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా లబ్దిదారుల ఎంపికకు కసరత్తు కొనసాగుతోంది. దీంతో గ్రామ సభలు రసాభాసగా మారుతున్నాయి.

సొంత స్థలం ఉన్న వారితో పాటు స్థలం లేని వారికి సంబంధించిన వివరాలను మండల స్థాయిలో ఎంపీడీవోలు, పురపాలికల్లో కమిషనర్లకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. క్షేత్ర స్థాయిలో ఉండే జిల్లా అధికారులకు, గృహ నిర్మాణ శాఖకు ఈ సమాచారం చేరడం లేదు. దీంతో ప్రజల సందేహాలను నివృత్తి చేయడం కూడా అధికారులకు సాధ్యం కావట్లేదు.

జనవరి 26వ తేదీన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినా.. ఎంపికైన లబ్దిదారుల జాబితా రావడానికి మరింత సమయం పడుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎంపికైన లబ్దిదారుల జాబితాకు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా కొలిక్కి రావడానికి చాలా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Whats_app_banner